ప్రవీణ క్రియేషన్స్ పతాకంపై ఎస్ .కరణ్ రెడ్డి సమర్పణలో ఎస్. రామారావు నిర్మిస్తోన్న చిత్రం ` డేర్`. నవీన్ అనే కొత్త కుర్రాడు హీరోగా పరిచయం అవుతున్నాడు. కె. కృష్ణ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. జి.ఆర్. నరేన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం హైదరాబాద్ సారథి స్టూడియో లో జరిగింది. లహరి మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ ఆడియో సీడీలను విడుదల చేయగా తొలి సీడీని డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ తొలి సీడీని అందుకున్నారు. ఈ సందర్భంగా…
అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ“సినిమా పాటలు బావున్నాయి. దర్శకుడు కృష్ణప్రసాద్, నిర్మాత రామారావుకి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్“ అన్నారు.
డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ మాట్లాడుతూ – “చిన్న సినిమాలు మంచి కాన్సెప్ట్‌తో వస్తున్నాయి. డేర్ సినిమా కాన్సెప్ట్ కూడా ప్రేక్షకులకు నచ్చాలని కోరుకుంటున్నాను. దర్శక నిర్మాతలకు, హృరో నవీన్ సహా ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్“ అన్నారు.
చిత్ర దర్శకుడు కె.కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, ` ఆద్యంత ఆసక్తికరంగా సాగే సినిమా ఇది. నవీన్ కొత్త కుర్రాడైనా చక్కగా నటించాడు. మిగతా ప్యాడింగ్ కూడా బాగుండటంతో మంచి అవుట్ ఫుట్ వచ్చింది. పాటలు, ఫైట్స్ సినిమాకు హైలైట్ గా ఉంటాయి. అన్ని పనులు పూర్తిచేసి త్వరలోనే సినిమా రిలీజ్ చేస్తాం` అని అన్నారు.
నిర్మాత ఎస్.రామారావు మాట్లాడుతూ, ` కథానుగుణంగా చక్కని పాటలు కుదిరాయి. సదా చంద్ర మంచి పాటలు రాశారు. వాటికి నరేన్ మంచి ట్యూన్స్ తో అందర్ని ఆకట్టుకునే లా కంపోజ్ చేశారు. సినిమాకు పాటలు పెద్ద అస్సెట్ అవుతాయి. అలాగే రాఘవ మాటలు చక్కగా రాశారు. నవీన్ నటన ప్రశంసనీయం. జీవా, సుమన్ శెట్టిల నటన సినిమాకు అదనపు బలం. సినిమా పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది` అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ నరేన్ మాట్లాడుతు : – దర్శక,నిర్మాతలు నాకు కరెక్ట్ సిచ్వవేషన్ చెప్పి నా దగ్గర మంచి మ్యూజిక్ రాబట్టుకున్నారు. పాటలన్ని బాగా వచ్చాయన్నారు..
మాటల రచయిత రాఘవ మాట్లాడుతూ:-నాకు ఒక లవ్ ఉంది సినిమాకు రైటర్ గా పని చేసాను, కాటకృష్ణ ప్రసాద్ నా గురువుగారు,నాకీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు, ఒక ప్రొఫెసర్ ఇచ్చిన టాస్క్ కు తన స్టుడెంట్స్ కు వారంరోజులు ఫారెస్ట్ లో గడిపి న్యాచురల్ గా ఎంజాయ్ చేసి రమ్మన్నాడు వారు ఫారెస్ట్ కి వెళ్లి అనుకోని పరిస్థితుల్లో ప్రమాదంలో చిక్కుకొంటారు,వారు ఆ ప్రమాదం నుండి ఎలా బయడపడ్డారన్నదే “డేర్” సినిమా అన్నారు.
హీరో నవీన్ మాట్లాడుతూ, ` టీమ్ అంతా కష్టపడి ఇష్టపడి పనిచేశాం. మంచి అవుట్ ఫుట్ వచ్చింది. కెమెరా పనితనం హైలైట్ గా ఉంటుంది. విజువల్స్ బాగున్నాయి. సినిమా అందరికీ నచ్చుతుందని డేర్ గా చెప్పగలను` అని అన్నారు.
ఇతర పాత్రల్లో జీవా, మధు, సుమన్ శెట్టి, నారి, రాఘవ, పొట్టి మధు, సురేష్ , పల్లవి, జ్యోతి, సుహాసిని, అనూష రెడ్డి, సాక్షి, మేఘన, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: రాఘవ, పాటలు: సదా చంద్ర, ఫైట్స్: దేవరాజ్, కొరియోగ్రఫీ, తాజ్ ఖాన్, ఎడిటింగ్: పాపారావు, ఛాయాగ్రహణం: దంతు వెంకట్, సంగీతం: జి.ఆర్. నరేన్, నిర్మాత ఎస్: రామారావు, కథ, కథనం, దర్శకత్వం: కె. కృష్ణ ప్రసాద్.