సూపర్ స్టార్ రజీనికాంత్ నటించిన చిత్రం దర్బార్. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నయనతార, నివేధా థామస్ లు కథానాయికలుగా నటించారు. ఈసినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కలెక్షన్ల పరంగా కూడా సత్తా చాటుతుంది. అయితే ఈసినిమాను కూడా ఫైరసీ వెంటాడుతుంది. హెచ్డీ వర్షెన్ లింక్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసి, దీనిని అందరికి షేర్ చేయండని కామెంట్ కూడా పెట్టారు.
ఇదిలా ఉండగా శరణ్య టీవీ ఛానల్ దర్భార్ పైరసీ ప్రింట్‌ని జనవరి 12న మధురైలో ప్రసారం చేశారు. ఇది చూసిన పలువురు నిర్మాతలకు తెలియజేశారు. దీంతో లైకా ప్రొడక్షన్ సంస్థ టీవీ యాజమాన్యంపై తీవ్రంగా ఫైర్ కావడంతో పాటు పోలీసులకి ఫిర్యాదు చేసింది. సినిమా విడుదల అయి నాలుగు రోజులు కూడా గడవక ముందే టీవీలో ఎలా ప్రసారం చేస్తారని? తమిళ చిత్ర పరిశ్రమకు నష్టం చేకూరుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ఛానల్ యాజమాన్యం ఇంకా స్పందించలేదు.