ఎన్టీఆర్ తో దానవీర శూర కర్ణః వివి వినాయక్

440
VV-Vinayak
- Advertisement -

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ హీరోగా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు సీనయ్య అనే టైటిల్ ను ఖారారు చేశారు. దసరా పండుగ సందర్బగా ఈటైటిల్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. నరసింహ అనే దర్శకుడు ఈచిత్రాన్ని తెరకెక్కించగా…ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

తాజాగా విడుదలైన ఈలుక్ లో వినాయక్ అదరగొట్టాడు. పూర్తిగా తన గెటప్ ను మార్చేశాడు. ఈమూవీ షూటింగ్ ఇటివలే ప్రారంభమైంది. ఈమూవీలో వినాయక్ రైతు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గోన్న వినాయక్ పలు విషయాలు తెలిపాడు.

తనను హీరోగా ట్రై చేయమని చాలా మంది చెప్పారు. కానీ అందరి కంటే ఎక్కువగా ఆర్ నారాయణమూర్తి చాలా సార్లు నాతో అన్నారు. ఆయన అలా అన్నప్పుడల్లా నాకు ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాకపోయేది. ఇప్పుడు హీరోగా చేస్తుంన్నందుకు చాలా హ్యాపిగా ఉంది. ప్రముఖ నటుడు దివంగత ఎన్టీఆర్ నటించిన ‘దానవీర శూర కర్ణ’ చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో రీమేక్ చేయాలని ఉందని చెప్పాడు.

- Advertisement -