రేవంత్ రెడ్డి…తెలంగాణకు పట్టిన శని: దానం నాగేందర్

235
danam nagender
- Advertisement -

ఆరేళ్లగా తెలంగాణ లో గతం లో కనివిని ఎరుగని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ……..సచివాలయం కూల్చి వేత పై హై కోర్టు ను ప్రతిపక్షాలు తప్పు దొవ పట్టించాయన్నారు. కాంగ్రెస్,బీజేపీ నేతలు కళ్లుండి చూడలేని కబోధులుగా మారారని మండిపడ్డారు.

అభివృద్ధి పై వేలు పెట్టి చూయించే పరిస్థితి లేదు కనుకే ప్రజలకు సంబంధం లేని విషయాలపై ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని విమర్శించారు దానం. ప్రతి పక్షాల నేతలు బుద్ది జ్ఞానం లేకుండా మాట్లాడటం మానుకోవాలి …ప్రజలు ఎన్ని సార్లు ఛీ కొట్టినా ప్రతిపక్షాలు మారడం లేదన్నారు. ఇప్పటికీ మారకుంటే ప్రతిపక్షాలకు బంగాళా ఖాతమే దిక్కు…హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే సచివాలయం కూల్చివేతలు మొదలయ్యాయని తెలిపారు.

సచివాలయంలో ప్రార్థనా మందిరాల కూల్చివేతపై సీఎం కెసిఆర్ ఇప్పటికే వివరణ ఇచ్చారు…ప్రతిపక్షాల నేతలు జాగ్రత్తగా మసలుకుంటే వారికే మంచిదన్నారు. పాత సచివాలయం భద్రతా ప్రమాణాలకనుగుణంగా చూస్తే పనికి రాదు…గతంలో అగ్నిప్రమాదాలు జరిగాయి…రేవంత్ రెడ్డి తెలంగాణ కు పట్టిన శని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెబుతారు…వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు సింగిల్ డిజిట్ కూడా రాదన్నారు. ఎవరిని సీఎం చేయాలో కెసిఆర్ పరిధిలోనిది ..దీనిపై ప్రతిపక్షాలకు మాట్లాడే హక్కు ఎక్కడిది ?…ప్రతిపక్షాలు అనవసర విషయాలపై మాట్లాడే బదులు మౌనంగా ఉండటమే మంచిదన్నారు.

కాంగ్రెస్ ,బీజేపీ నేతలకు అసహనం పెరిగి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్. కెసిఆర్ ను మించిన లౌకిక వాది లేరు…మానవత్వానికి మారు పేరు కెసిఆర్ అన్నారు. రాష్ట్రం లో గంగా జమునా తెహిజిబ్ నడుస్తోంది…మతాల మధ్య చిచ్చు పెట్టడమే కాంగ్రెస్ ,బీజేపీ ల పని అన్నారు. చిన్న ఘటనల పై రాజకీయం చేస్తున్నారు…కెసిఆర్ పై ప్రజల్లో గట్టి విశ్వాసం ఉంది…ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకునే స్థితి లో ప్రజలు లేరన్నారు. గత ఆరేళ్లగా ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారు…ప్రజల మధ్య చిచ్చుపెట్టే యత్నాలు సహించం …కాంగ్రెస్ ,బీజేపీ నేతలు నొరు అదుపు లో పెట్టుకోవాలన్నారు.

- Advertisement -