అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరం: దానం

3
- Advertisement -

అల్లు అర్జున్ మా చుట్టం.. ఆయన అరెస్ట్ బాధాకరం అన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆయన జాతీయ నటుడే కాదు.. ప్రపంచ స్థాయి నటుడు అన్నారు. బన్నీ అరెస్ట్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు.

అల్లు అర్జున్‌ అరెస్ట్ పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను అన్నారు. మొత్తానికి బెయిల్ దొరకడం సంతోషకరం, అల్లు అర్జున్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తీసుకొచ్చారు అన్నారు.

ఆయన అరెస్ట్ కావడాన్ని దురదృష్టకర సంఘటనగా భావిస్తున్నా…అల్లు అర్జున్‌ను ప్రభుత్వమే అరెస్ట్ చేయించిందని ప్రతిపక్షాలు అనడం భావ్యం కాదు అన్నారు.

Also Read:Bigg Boss 8: నిఖిల్ జర్నీ వీడియో

- Advertisement -