వర్షాకాల విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు నగరంలోని ప్రతి శాఖ ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారిని నియమించాలన్నారు జీహెచ్‌ఎంసీ దాన కిషోర్. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
భారీ వర్షాల వల్ల రోడ్లపై చెట్లు, భారీ వృక్షాలు కూలి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నయ రహదారులను గుర్తించాలన్నారు. ఆకస్మిక వర్షాలు కురిసి లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురి అయితే ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోకి తక్షణమే తరిలించేందుకు వీలుగా ప్రతి వార్డులో కమ్యునిటీహాళ్లు, పాఠశాలలు, ఖాళీ స్థలాలను గుర్తించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు హరిచందన, శృతిఓజా, కృష్ణ, చీఫ్ ఇంజనీర్లు సురేష్, జియాఉద్దీన్, శ్రీధర్, జలమండలి డైరెక్టర్లు కృష్ణ, సూర్యనారాయణ, ప్రవీణ్‌కుమార్, రవి, ఎస్.పి.డి.సి.ఎల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకముందు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు దాన కిషోర్.