నగరంలో బల్దియా కమిషనర్ ఆకస్మిక తనిఖీలు..

304
- Advertisement -

నగరంలో పలు అభివృద్ధి పధకాల అమలు, ప్రాజెక్ట్‌ల భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలు, సాఫ్ హైదరాబాద్-స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమ నిర్వహణ తదితర అంశాలపై జీహెచ్ఎంసీ కమీషనర్ దాన కిషోర్ నేడు చార్మినార్ జోన్‌లో విస్తృతంగా పర్యటించారు. బహదూర్ పుర ఫ్లై ఓవర్ నిర్మాణనికి భూసేకరణ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు గాను సహాయ సిటీ ప్లానర్‌కు చార్జి మెమో అందచేయడంతో పాటు, చార్మినార్ జోన్ సిటీ ప్లానర్‌కు మెమో జారీ చేయాలని కమీషనర్ ఆదేశించారు.

నేడు ఉదయం బహదూర్ పూరా ఫ్లైఓవర్ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో సమీక్షించారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఆస్తులను అందించిన 93 మందికి వెంటనే రెండు రోజుల్లోగా చెక్కులు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ ఫ్లయ్ ఓవర్ కు ఇప్పటి వరకు 18 పిల్లర్ల కు గాను 6 పిల్లర్ల నిర్మాణం పూర్తి అయిందని, మిగిలిన పనులను వేగవంతంగా చేయనున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. సుదీర్ఘ కాలంగా ఈ ప్రాజెక్ట్ కు ఆస్తుల సేకరణలో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు గాను సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులపై తీవ్ర ఆగ్రహ౦ వ్యక్తం చేశారు.

Dana Kishore

చాంద్రాయగుట్ట లోని రక్షాపురంలో సాఫ్, శాందార్ హైదరాబాద్ కార్యక్రమం అమలును పరిశీలించారు. హైదరాబాద్ నగరాన్ని మరింత పరిశుభ్రంగా రూపొందించడానికి ప్రతి సర్కిల్‌కు నాలుగు వాహనాలు, ఒక జె.సి.పి ని అందచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్బంగా ఇంటింటి నుండి తడి, పొడి చెత్త అందిస్తున్న విషయాన్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా రక్షాపురం రోడ్డు విస్తరణ పనులపై సమీక్షించారు. హబీబ్ నగర్ నుండి రక్షపురం వరకు రోడ్ విస్తరణకు కేవలం ఆరు ఆస్తుల సేకరణ మాత్రమే జరగాల్సి ఉందని స్థానిక కార్పొరేటర్ సలీం కమీషనర్ కు వివరించారు. దీంతో వెంటనే ఆరు ఆస్తుల పరిహారం చెల్లించే ఫైల్ సమర్పించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశించారు. రూ. 8 .32 కోట్ల వ్యయంతో చేపట్టిన రక్షాపురం రోడ్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.

అనంతరం అక్బర్ నగర్ నాలా పూడిక పనులను కమీషనర్ పరిశీలించారు. ఈ నాలా పై ఇటీవల రూ.1 90 కోట్ల వ్యయంతో బ్రిడ్జిని నిర్మించగా అప్రోచ్ రోడ్ పనులను చేపట్టలేదని స్థానిక కార్పొరేటర్ తెలిపారు. వెంటనే ఈ అప్రోచ్ పనులను పూర్తి చేయాలనీ కమీషనర్ ఆదేశించారు. అక్బర్ నాలాకు పక్కగా ఉన్న ఖాళీ స్థలాన్ని భావన నిర్మాణ వ్యర్ధాల నిల్వకు ఉపయోగించాలని కమీషనర్ సూచించారు. జోహ్రాబీ దర్గా వద్ద ఉన్న ఓపెన్ నాలాలో జరిగే పనులను, రోడ్ విస్తరణ పనులను ఎమ్మెల్ల్యే పాషా ఖాద్రితో కలిసి పరిశీలించారు. జోహ్రాబీ దర్గా ఓపెన్ నాలా పనులను సేకరించిన ఆస్తులకు సంబందించిన తొమ్మిది చెక్కులను వరం రోజులలోగా అందచేయాలని దాన కిషోర్ ఆదేశించారు. అనంతరం రూ. 1 .97 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బాక్స్ డ్రైన్ పనులను దబీర్పూర కమాన్ వద్ద ఎమ్మెల్ల్యే పాషా ఖాద్రి, ఎమ్మెల్సీ అఫన్దితో కలిసి ప్రారంభించారు.

- Advertisement -