టీజీబీపాస్‌ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం..

10
- Advertisement -

టీజి బీపాస్‌ (తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ వెరిఫికేషన్‌ సిస్టమ్‌) దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం దాన కిషోర్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.

లేఅవుట్‌, భవన నిర్మాణాలకు ఆన్‌లైన్‌ ద్వారా నిర్ణీత గడువులో అనుమతులు ఇచ్చే టీజి బీపాస్‌ దరఖాస్తుల పరిష్కార పురోగతి పై సచివాలయంలో గురువారం ప్లానింగ్ అధికారులతో ముఖ్య కార్యదర్శి సమీక్షించారు.

టీజి బీపాస్‌ దరఖాస్తుల డిస్పోజల్ వేగంగా చేపట్టాలన్నారు.దరఖాస్తుతో జత చేయాల్సిన ఏవైనా డాక్యుమెంట్ లు తక్కువగా ఉంటే ఆ విషయాన్ని దరఖాస్తుదారుడికి తెలియజేస్తూ తిరిగి అన్ని డాక్యుమెంట్ లతో దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు.

ప్రస్తుత సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకూ టీఎస్‌ బీపాస్‌ కింద HMDA, GHMC లకు వచ్చిన దరఖాస్తులు వాటి పరిష్కార ప్రగతి పై తనకు నివేదికలు ఇవ్వాలన్నారు.ఇకనుంచి ప్రతి శనివారం టీజి బీపాస్‌ దరఖాస్తుల పరిష్కార ప్రగతి పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Also Read:KTR: సీఎం రేవంత్ ప్రొద్బలంతోనే కౌశిక్ రెడ్డిపై దాడి

- Advertisement -