కోల్‌కతా వైద్యురాలి అత్యాచార,హత్య ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. ఈ ఘటనపై CBI కేసు వేగవంతం చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది భద్రతపై ఉన్నతాధికారులతో మంత్రి చర్చలు జరిపారు. ఇప్పటికే ప్రభుత్వం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లో డాక్టర్లు, నర్సులు మరియు వైద్య సిబ్బంది భద్రతకు సంబంధించిన అంశాలను పొందుపరిచామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళల రక్షణ, భద్రత పై ఇప్పటికే ‘ షీ టీమ్స్’ కట్టుదిట్టంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. తెలంగాణ జూడాల అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిలో భాగంగా వర్క్ స్టేషన్లలో మహిళ డాక్టర్ల భద్రతకు తీసుకోవాల్సిన అంశాలపై కట్టుబడి ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు.
Also Read:KTR:రుణమాఫీపై కేటీఆర్ సవాల్, నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా