భారీ వర్షాలు..దామోదర టెలీకాన్ఫరెన్స్

6
- Advertisement -

తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో మంత్రి దామోదర రాజనర్సింహ కీలక సూచనలు చేశారు. బుధవారం ఉదయం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి టెలీకాన్ఫరన్స్ నిర్వహించారు.

హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, ఆర్‌ఎంవోలు, మెడికల్ ఆఫీసర్లు, డాక్టర్లు, సిబ్బంది ఈ మూడు రోజులు ఖచ్చితంగా విధుల్లో ఉండాలని సూచించారు మంత్రి. అత్యవసర పరిస్థితుల్లో‌ వచ్చే రోగులకు, గర్భిణులకు తక్షణమే వైద్య‌ సేవలు అందించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

అంబులెన్స్‌లు, 102 వాహనాలు అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని, ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా తక్షణమే వెళ్లి రోగులను తరలించేలా‌ డ్రైవర్లు, ఈఎంటీలను 24 గంటలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు మంత్రి దామోదర రాజనర్సింహ.

Also Read:చంద్రబాబు,పవన్‌లకు తారక్ థ్యాంక్స్

- Advertisement -