జమునా హ్యాచరీస్ ముందు దళితుల ఆందోళన

90
etela
- Advertisement -

మెదక్ జిల్లా అచ్చంపేట జమున హ్యాచరీస్ కంపెనీ ముందు దళితులు ఆందోళన చేపట్టారు. దళితుల ఆందోళనకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఈటెల రాజేందర్ కంపెనీ వల్ల నిరుపేద రైతులు నష్టపోయారన్నారు. నిరుపేద రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

అసైన్డ్ భూములను తిరిగి ఇచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. సీఎం కేసిఆర్ దృష్టి కి తీసుకువెళ్ళి పేదలకు న్యాయం చేస్తామన్నారు. సర్వే కు అందరు సహరించాలి…చట్ట ప్రకారం అందరూ నడుచుకోవాలన్నారు. కలెక్టర్ త్వరగా అసైన్డ్ భూములను పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

నిరుపేదల భూములు అన్యక్రాంతం అయ్యాయన్నారు IFCO డైరెక్టర్ దేవేందర్ రెడ్డి. రోడ్లు వేసి, వారి భూములు చదును చేశారు…ఈటెలరాజేందర్ 80 ఎకరాల అసైన్డ్ భూములు కబ్జా చేసినట్టు సమాచారం ఉందన్నారు. ఈటెల పేదల భూములు తిరిగి ఇవ్వాలి…రైతుల పక్షాన టీ ఆర్ ఎస్ పోరాటం చేస్తుందన్నారు.

- Advertisement -