దళిత బంధు నిధులు విడుదల..

105
dalitha bandhu

వాసాల‌మ‌ర్రి ద‌ళితుల‌కు ఇచ్చిన మాట‌ను నిలబెట్టుకున్నారు సీఎం కేసీఆర్. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిల‌బెట్టుకున్నారు. వాసాల‌మ‌ర్రిలోని 76 ద‌ళిత కుటుంబాల‌కు రూ. 7.60 కోట్లు విడుద‌ల చేశారు. ఈ మేర‌కు నిధుల విడుద‌ల‌కు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ద‌ళిత బంధు నిధులు విడుద‌ల కావ‌డంతో వాసాల‌మ‌ర్రి ద‌ళితులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. సీఎం కేసీఆర్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.