దలేర్ మెహందీ…దోషి

258
Daler Mehndi Sentenced To 2 Years Jail
- Advertisement -

ప్రముఖ పంజాబ్ పాప్ సింగర్‌ని దోషిగా తేల్చింది పటియాలా న్యాయస్ధానం. మనుషులను అక్రమంగా రావాణా చేశాడని కోర్టు తేల్చి చెప్పింది.ఆయనకు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 1998, 1999లో 10 నుంచి 15 మందిని చట్టవిరుద్ధంగా కెనడా, అమెరికా తీసుకెళ్ళి, అక్కడే విడిచిపెట్టినట్లు 35 కేసులు నమోదయ్యాయి. 2003లో ఛార్జిషీటు దాఖలు కాగా వీటిలో ఓ కేసులో పాటియాలా కోర్టు తీర్పు వెలువరించింది.

దలేర్ మెహందీ, ఆయన సోదరుడు షంషేర్ విదేశాల్లో సంగీత విభావరులు నిర్వహించేవారు. వీరి సంగీత బృందంతో పాటు చట్టవిరుద్ధంగా కొందరిని అమెరికా తీసుకెళ్ళేవారని ఆరోపణలు వచ్చాయి.ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదుచేశారు. ఇందుకోసం పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు.అయితే సుదీర్ఘ విచారణ అనంతరం ఓ కేసులో కోర్టు తీర్పు వెలువరించగా ఆయనకు బెయిల్ మంజూరైంది.

- Advertisement -