సౌతాఫ్రికా బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. 2019/20 సీజన్‌లో స్టెయిన్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగుతారని పేర్కొంది. తన బౌలింగ్‌తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన స్టెయిన్ అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నాడు.
2004 డిసెంబర్ 13వ తేదీన ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో స్టెయిన్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో అడుగుపెట్టారు. తన టెస్ట్ కెరీర్‌లో 93 మ్యాచ్‌లు ఆడిన స్టెయిన్ 3.24 ఎకానమీతో 439 వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా స్టెయిన్ నిలిచాడు. టెస్ట్ క్రికెట్‌లో వేగంగా 100 వికెట్‌లు పడగొట్టిన దక్షిణాఫ్రికా బౌలర్‌గా స్టెయిన్ రికార్డు సృష్టించాడు.
పూర్తిగా వన్డేలు, టీ20 ఫార్మట్ లపై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టెయిన్ వెల్లడించాడు. ఈ సంధర్భంగా టెస్ట్ మ్యాచ్ లకు వీడ్కోలు పలకడం బాధగా ఉన్నప్పటికీ, ఈ నిర్ణయం తీసుకోక తప్పట్లేదు అని తెలిపారు. ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.