హైటెక్స్ రోడ్‌లో దలైలామా సెంటర్ ఫర్ ఎథిక్స్ నిర్మాణానికి బౌద్ధమత గురువు దలైలామా శంకుస్థాపన చేశారు. హైటెక్స్‌లో నీతి,విలువలు అనే అంశంపై దలైలామా మాట్లడారు. ఎవరినైనా చిరునవ్వుతో పలకరించడం అలవర్చుకోవాలి. చిరునవ్వు పలకరింపు మనకు, ఎదుటివారికి సాంత్వన చేకూరుతుందని ఆయన హితవు పలికారు. హత్యలు, ఘర్షణలతో శాంతి చేకూరదు, అహింస తోనే ప్రపంచ శాంతి చేకూరుతుందని పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ ఒక్కరే అహంస సిద్ధాంతాన్ని పాటించారని ఆయన అన్నారు.
గ్లోబర్ వార్నింగ్ అనేది అన్ని దేశాలకు సమస్యగా మారింది. వందల ఏళ్ల క్రితమే ఎందరో విదేశీయులు భారతదేశ గొప్పతనాన్ని గుర్తించారు. ప్రపంచానికి తత్వశాస్త్రాన్ని బోధించిన పుణ్యభూమి భారత్. వైదిక మతంతో పాటు ఇస్లాం, బౌద్ధం, క్రైస్తవం, జొరాస్టియన్ మతాలను ఆదరించిన దేశం ఇది. పాకిస్థాన్ కంటే భారత్‌లోనే ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని మతస్వేచ్ఛ, శాంతి భారత్‌లోనే ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ…. ప్రపంచంలోని ఎన్నో యూనివర్సిటీల నుంచి దలైలామా డిగ్రీలు తీసుకున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచంలోనే ఎంతోమందిని ప్రభావితం చేసిన వ్యక్తి దలైలామా అని మంత్రి అన్నారు. 1989లోనే ఆయనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చిందని పేర్కొన్నారు. దలైలామా సెంటర్ ఫర్ ఎథిక్స్ భవనానికి రూ.5కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
సెంటర్ ఫర్ ఎథిక్స్‌కు దలైలామా శంకుస్థాపన…..
- Advertisement -
- Advertisement -