దీపికా పదుకొనే డ్రెస్‌ చెత్తగా ఉందట..!

192
Online News Portal
Daily Mail calls Deepika Padukone's MTV EMA look Bollywood Blunder
- Advertisement -

ఇటీవల బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన దీపిక పదుకొణె అక్కడి ఫ్యాషన్‌ను బాగా ఒంటబట్టించుకొంది. నెదర్లాండ్‌లోని రాటర్‌డాంలో జరిగిన ఎంటీవీ యూరోపియన్‌ మ్యూజిక్‌ అవార్డ్స్‌లోనూ ఈ భామ డ్రెస్సింగ్‌ స్టైల్‌ అదిరిపోయింది. హాలీవుడ్‌ కథానాయికలు, సెలెబ్రిటీలు ఎక్కువగా ఈ తరహా డ్రెస్‌ల్లో కనిపిస్తుంటారు. ఇలాంటిది వేసుకొన్న తొలి భారతీయ నటిగా దీపిక నిలిచింది. ఆ డ్రెస్‌ ధర సుమారు రూ. 10 లక్షలకు పైగా ఉంటుంది. బ్రా మాదిరిగా ఉన్న టాప్.. సేమ్ డిజైన్ తో ఓవర్ కోట్.. వన్ సైడ్ కట్ ఉన్న గ్రీన్ స్కర్ట్.. మొత్తం కలిపి దీపిక కొత్త స్టైల్ నే పరిచయం చేసింది. క్లీవేజ్ అందాలతో పాటు.. మిలమిల్లాడిన మిగిలిన సోయగాలు.. బాగానే మైమరిపించాయి.

Celebs at MTV Europe Music Awards Photos_24

దీపికా పదుకొనే డ్రసింగ్ సెన్స్ సూపరంటూ తెగ పొగిడేస్తుండగా.. బ్రిటిష్ పత్రిక డెయిలీ మెయిల్ ‘బాలీవుడ్ బ్లండర్’ అంటూ విమర్శించింది. ఈ కార్యక్రమానికి ఆమె ధరించి వచ్చిన డ్రెస్సు చాలా చెండాలంగా ఉందంటూ ‘డెయిల్ మెయిల్’ పేర్కొంది. అంతేకాకుండా, ‘బాలీవుడ్ బ్లండర్’ దీపికాపదుకొనే అంటూ రాసుకొచ్చింది. కాగా, ‘దీపికా పదుకొనే ధరించిన డ్రెస్సు సూపర్’, ‘దీపికా పదుకొనే లా రెడ్ కార్పెట్ పై నడవాలన్నదే నా కోరిక ’, ‘అవర్ క్వీన్’, ‘కోట్లాది మంది నిన్ను అభిమానిస్తున్నారు’ అంటూ దీపికను ప్రశంసిస్తూ పలు ట్వీట్లు వచ్చాయి.

గతంలో దీపికా టెన్నిస్‌ స్టార్ నోవాక్ డిజెకోవిక్‌తో కలిసి ఓ రెస్టారెంట్‌ నుండి భయటకు వచ్చినపుడు దీపికా పదుకొనే ఎవరో తెలియనట్లు హాలీవుడ్ మేగజైన్ డైలీమెయిల్‌లో ఓ ప్రముఖ స్టోరీ పబ్లిష్ అయ్యింది. ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్.. లాస్ ఏంజెల్స్‌లోని ఓ హైఎండ్ బార్‌కి వచ్చాడని ఓ అందమైన భామ కూడా ఆతని వెంటే వచ్చిందని ప్రచురించింది. ఆ భామతో నోవాక్ చాలాసేపు గడిపినట్లు డైలీ మెయిల్ ఫోటోలతో పాటు పబ్లిష్ చేసింది. అయితే ఆ ఆర్టికల్‌లో ఎక్కడా దీపికా పదుకునే పేరు పబ్లిష్ కాకపోవడం ఆమె ఫ్యాన్స్‌కు షాకిచ్చే అంశం. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది.

deepika

- Advertisement -