డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు..భారత్‌లోనే ఎక్కువ!

0
- Advertisement -

నేటిరోజుల్లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ సమస్య అన్నీ వయసుల వారిని వేధిస్తోంది. ఒక్కసారి మధుమేహం బారిన పడితే దానినుంచి బయటపడడం అంతా తేలికైన విషయం కాదు. అందుకే చక్కెర వ్యాధి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. అయితే మధుమేహ సమస్య పురుషులతో పోల్చితే మహిళల్లోనే ఎక్కువ అని పలు అద్యయానాలు చెబుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికి 82.8 కోట్లమందికి పైగా డయాబెటిస్‌ బారినపడినట్లు అంచనా. భారతదేశంలో నాలుగోవంతు జనాభా ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్య పరిశోధన అంశాల పత్రిక ‘లాన్సెట్‌’లో ప్రచురితమైన కథనం అందరిని షాక్‌కు గురిచేస్తోంది.

82.8 కోట్ల సంఖ్య 1990లో డయాబెటిస్‌ బాధితుల సంఖ్యకు నాలుగు రెట్లు ఉందని, ముఖ్యంగా చిన్న, మధ్యస్థ ఆదాయ దేశాల (ఎల్‌ఎంఐసి)లో అత్యంత పెరుగుదల ఉన్నట్లు నివేదిక తెలిపింది. 30 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 44.5 కోట్ల మంది పెద్దలు 2022లో చికిత్స తీసుకోకపోవడంతో షుగర్‌ కేసులు పెరిగినట్లు నివేదిక తెలిపింది.

భారత్‌లో 44.5 కోట్లలో మూడింట ఒక వంతు (13.3 కోట్లు) భారత్‌లోనే ఉన్నట్లు పేర్కొంది. చైనాలో 14.8 కోట్ల మంంది ఉండగా, అమెరికాలో 4.2 కోట్లు, పాకిస్థాన్‌లో 3.6 కోట్లు, బ్రెజిల్‌లో 2.2 కోట్ల మంది ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

Also Read:ప్రపంచ దేశాధినేతలతో మోదీ వరుస భేటీలు

- Advertisement -