శ్రీవారి సన్నిధిలో ‘డెకాయిట్‌’ టీమ్

3
- Advertisement -

తిరుమలలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీవారిని దర్శించుకుంది ‘డెకాయిట్‌’ చిత్ర బృందం . వీఐపీ విరామ సమయంలో ప్రత్యేక దర్శనం చేసుకున్న హీరో అడవి శేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఆలయ అర్చకుల ఆశీర్వాదం పొందారు.

దర్శనం అనంతరం వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. సినిమా విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించినట్లు చిత్ర బృందం తెలిపింది. భక్తులతో కలిసి ప్రశాంత వాతావరణంలో జరిగిన ఈ దర్శనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

శేష్ – మృణాల్ జంట మధ్య ఉన్న సహజమైన కెమిస్ట్రీ ఈ పాటకు ఎమోషనల్ పవర్. వారి ప్రేమలోని మాధుర్యం, తరువాత జరిగే ద్రోహం వల్ల కలిగే బాధ ఇవన్నీ “రుబారూ”లో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ పాట సినిమా కథలో ఒక కీలక మలుపు కాబోతోంది.

Also Read:‘పెద్ది’..సెకండ్ సింగిల్ అప్‌డేట్!

సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తోంది. సినిమాటోగ్రఫీని ధనుష్ నిర్వహిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను జ్ఞాని అందిస్తున్నారు. ‘డెకాయిట్‌’ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -