ఈ నెల 22న డబీర్‌పుర వార్డు ఎన్నికల పోలింగ్ పర్సన్స్ సెకండ్ ర్యాండమైజేషన్ ప్రక్రియ శుక్రవారం జిహెచ్ఎంసి కార్యాలయంలో నిర్వహించారు. ఈ వార్డు ఎన్నికల జనరల్ అబ్జర్వర్ సిక్తాపట్నాయక్ సమక్షంలో ఎన్నికల అథారటి, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాండమైజేషన్ జరిగింది. ఈ వార్డులోని 66 పోలింగ్ కేంద్రాలకు 66 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 66 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లను 264 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేశారు.
వీరితో పాటు నిబంధనల మేరకు అదనంగా 20శాతం పోలింగ్ పర్సనల్‌ను రిజర్వులో ఎంపిక చేశారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫిసర్లకు ఈ నెల 14న చార్మినార్, ఏరియాలోరి సర్దార్ మహల్ జిహెచ్ఎంసి ఎదురుగా ఉన్న సనా గార్డెన్స్‌లో రెండో విడత పోలింగ్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. శిక్షణకు హాజరుకాని ఉద్యోగులపై ఎన్నికల నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఎన్నికల విభాగం జాయింట్ కమిషనర్ పంకజ, ఐటి విభాగం ఏఇ తిరుమల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.