వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ‘డాకు మహారాజ్’ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ సంచలన వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద విజయంగా నిలిచింది.
ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓటీటీలో కేవలం ఒక్క భాషలోనే రాబోతుంది అని అలాగే నటి ఊర్వశి రౌటేలా సన్నివేశాలు కూడా తీసేసారు అంటూ పలు రూమర్స్ వైరల్ అయ్యాయి.
Also Read:పల్లీలతో లాభాలెన్నో!
కానీ వీటిలో నిజం లేదని తేలిపోయింది. ఈ సినిమా ఒక్క భాషలో కాదు పాన్ ఇండియా భాషల్లోనే నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చేసింది. అలాగే ఊర్వశి రౌటేలాపై కూడా సన్నివేశాలు ఉన్నాయి.