ఓటీటీలో డాకు మహారాజ్.. హవా!

13
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డాకు మహారాజ్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది డాకు మహారాజ్.

వెండితెరపై ప్రేక్షకులను అలరించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా చిత్రం.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లోనూ సత్తాచాటుతోంది. రెండు వారాల్లో సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంది. మొదటి వారం కంటే రెండో వారం లోనే డాకు మహారాజ్ కు మంచి స్పందన వచ్చింది.

మొదటి వారం నెట్ ఫ్లిక్స్ లో 2.4 మిలియన్ వ్యూస్‌ని రాబట్టగా రెండో వారంలో 2.6 మిలియన్ వ్యూస్ ని అందుకుంది. రెండు వారాల్లో 5 మిలియన్ కి పైగా వ్యూస్ ని డాకు మహారాజ్ రాబట్టడం విశేషం.

Also Read:Janasena: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు

- Advertisement -