కుబేరాతో హిట్ కొట్టారు కోలీవుడ్ టాప్ హీరో ధనుష్. అలాగే తన హిందీ చిత్రం “తేరే ఇష్క్ మేన్” పూర్తి చేశాడు. ప్రస్తుతం తన కొత్త తమిళ చిత్రం, తాత్కాలికంగా “D54″గా పిలువబడుతున్న చిత్ర షూటింగ్‌ను ప్రారంభించాడు.
విఘ్నేశ్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ్టి నుండి షూటింగ్ మొదలైనట్టు ప్రకటించేందుకు మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో ధనుష్ కాలిన పత్తి పొలాల్లో గంభీరంగా నిలుచున్నాడు.వెనుక నిప్పు జ్వాలలు ఎగసిపడుతున్న దృశ్యం కనిపిస్తుంది.
ధనుష్ సరసన మమిత బైజు కథానాయికగా నటిస్తుండగా జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. జయరామ్, కె.ఎస్. రవికుమార్, సురాజ్ వేణ్జారమూడ్, కరుణాస్, మరియు పృథ్వీ పండిరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డా. ఇషారి. కె. గణేష్ నిర్మాతగా వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ మరియు థింక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Also Read:బెట్టింగ్ యాప్స్ కేసు..ఈడీ ఎంటర్!

