మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు డీఎస్. ఇవాళ ఉదయం ఇంట్లో గుండెపోటు రావడంతో మృతి చెందారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు డీఎస్. కాంగ్రెస్ అగ్రనేత సోనియాకు విధేయునిగా పనిచేశారు.
1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్‌లో డీఎస్ జన్మించారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా చేశారు ధర్మపురి శ్రీనివాస్. 1998లో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2004లో వైఎస్‌తో కలిసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడంలో కీలకపాత్ర పోషించారు. 1989, 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు డీఎస్.
2014 తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. గత ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్‌గా పనిచేయగా చిన్న కుమారుడు అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు.
Also Read:KCR:వచ్చేది బీఆర్ఎస్ సర్కారే