కాంగ్రెస్‌లోకి డీఎస్..

35
- Advertisement -

మాజీమంత్రి డి.శ్రీనివాస్ తిరిగి సొంతగూటికి కాంగ్రెస్‌లో చేరారు. డీఎస్ తో పాటు ఆయన పెద్ద కొడుకు సంజయ్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరగా వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

తాను కాంగ్రెస్ లో చేరడం లేదని ఇవాళ ఉదయం డీఎస్ పేరిట ఓ లేఖ రిలీజయింది. ఈ లేఖలో తన పెద్ద కొడుకు సంజయ్ తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నారని స్పష్టం చేశారు. అంతలోనే గాంధీ భవన్‌కు వీల్ చైర్‌లో వచ్చిన డీఎస్‌..హస్తం పార్టీలో చేరిపోయారు.

పార్టీలు వేరైనా తన కుమారులు ప్రజల కోసం పనిచేస్తున్నారని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -