అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు

17
- Advertisement -

పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీ.శ్రీనివాస్ ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్.. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి భౌతికకాయాన్ని తరలించారు.

డీఎస్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. డీఎస్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్‌ వాంతికుమారిని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.

మధ్యాహ్నం 2 గంటల వరకు పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం నిజామాబాద్‌కు తరలించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఇందూరు పట్టణంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

Also Read:మాజీ మంత్రి డీఎస్ కన్నుమూత…

- Advertisement -