లావుగా ఉంటే బలమైన నేత కాదు..నాగంపై అరుణ ఫైర్

403
nagam dk aruna
- Advertisement -

మాజీ మంత్రి,కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డిపై తీవ్రస్ధాయిలో మండిపడింది ఆ పార్టీ ఎమ్మెల్యే డీకే అరుణ. ఇటీవలె నాగం బీజేపీ నుంచి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగర్‌ కర్నూల్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత,ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో దామోదర్‌ను బుజ్జగించే చర్యలు చేపట్టిన అరుణ..నాగంపై విమర్శల వర్షం కురిపించింది.

గత ఎన్నికలలో గెలవలేని నాగం ఎలా బలమైన నాయకుడు అవుతారని ప్రశ్నించింది. బలమైన నాయకుడు అంటే లావుగా ఉండడం కాదని చురకలంటించిన అరుణ… ఒకవేళ బలమైన నాయకుడే అయితే కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చేవారు కాదని తెలిపింది.

నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ పార్టీకి అండగా ఉంది దామోదర్‌రెడ్డే అని స్పష్టం చేసింది. అలాంటి నాయకుడితో అధిష్ఠానం సంప్రదింపులు జరపకుండా నాగంని పార్టీలోకి తీసుకోవడం సరైన పద్ధతి కాదని చెప్పింది. ఆవేశం, ఆవేదన, బాధతో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీకి, వ్యక్తిగతంగా నష్టం జరుగుతుందని దామోదర్‌ రెడ్డికి సూచించింది అరుణ.

- Advertisement -