- Advertisement -
ఐదు రాష్ట్రాల్లో విలయం సృష్టించిన తౌక్టే తుపాన్ తీరం దాటింది. గుజరాత్‌లో తీరం దాటిన తుపాన్… స్వల్పంగా బలహీనపడినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. శక్తివంతమైన గాలులకు కొన్ని చోట్ల విద్యుత్తు స్తంభాలు కూలిపడ్డాయి. కొన్ని చోట్ల దాదాపు గంటకు 190 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి.
తౌక్టే తుపాను వల్ల కన్నడనాట తీరప్రాంత జిల్లాలు అతలాకుతలమయ్యాయి. తుపాన్ ప్రభావంతో ఈ నెల 20 తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని…దక్షిణ కన్నడ జిల్లాలో 108 ఇళ్లు దెబ్బతిన్నాయి. 380 మందిని సహాయక కేంద్రాలకు తరలించారు.
తుపాన్‌తో ఇళ్లు కూలిపోయినవారికి రూ.5 లక్షలు, బోట్ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ తెలిపారు. ఓ మోస్తరు ఇంటి మరమ్మతుల కోసం రూ. లక్ష చొప్పున అందిస్తామన్నారు.
- Advertisement -