స‌ముద్రం అల్ల‌క‌ల్లోలం.. ముంచుకొస్తున్న పెథాయ్..

183
Cyclone Phethai
- Advertisement -

సముద్రంలో ‘అల’జడి చెలరేగుతోంది. గాలుల తీవ్రత పెరిగింది. దట్టంగా మేఘాలు… వర్షాలు మొదలయ్యాయి. వెరసి… కోస్తాంధ్ర మొత్తం ‘పెథాయ్‌’తో వణుకుతోంది. మొన్నటికి మొన్న తితలీ… ఇప్పుడు పెథాయ్‌! కోస్తాంధ్రపై మరో తుఫాను విరుచుకుపడుతోంది. పెథాయ్‌ తీరం దిశగా దూసుకొస్తోంది.

తీవ్ర తుపానుగా మారిన ‘పెథాయ్‌’‌ ప్రస్తుతం కాకినాడ‌కు 200 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మై ఉంది. ఇది గంటకు 19 కి.మీ వేగంతో తూర్పుగోదావ‌రి జిల్లావైపు వేగంగా క‌దులుతోంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తుని-యానాంల మ‌ధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంట‌కు 100 నుంచి 110 కిలోమీట‌ర్ల వేగంతో కూడిన బ‌ల‌మైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Cyclone Phethai

పెథాయ్‌ ప్రభావంతో తూర్పుగోదారి, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంటకు 80 నుంచి 90 కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయి. తీరం దాటే స‌మ‌యంలో పెనుగాలుల‌తో కూడిన వ‌ర్షం విరుచుకుపడనుందని.. ప్ర‌జ‌లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -