‘మొంథా’ ఎఫెక్ట్..54 రైళ్లు రద్దు

7
- Advertisement -

మొంథా తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. విజయవాడ డివిజన్ మీదుగా వెళ్లే 54 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.

మంగళవారం, బుధవారం.. విజయవాడ, గుంటూరు, నర్సాపురం, కాకినాడ, విశాఖ, ఒంగోలు నుంచి బయలుదేరాల్సిన ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేశారు. తుఫాను నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఎంతో అప్రమత్తంగా ఉన్నారు అని తెలిపారు మంత్రి వాసంశెట్టి సుభాష్‌. ప్రభుత్వం అన్ని రకాల సహాయక చర్యలను సిద్ధం చేసింది ..అధికారులంతా పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు అన్నారు.

విజయవాడకు భారీ వర్ష సూచన.. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మొంథా తుఫాను నేపథ్యంలో మంగళవారం విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ.16 సెం.మీలకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు …అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకూడదని సూచనలు చేశారు.

కోస్తా జిల్లాల్లోని 26 తీరప్రాంత గ్రామాల్లో ప్రయోగాత్మకంగా మొంథా తుపాన్ హెచ్చరికలు జారీ చేశారు. క్షణాల్లో రియల్‌టైమ్ వాయిస్ అలర్ట్‌లు..అవేర్నెస్ అలర్ట్ బ్రాడ్కాస్టింగ్స్ సాంకేతికత వినియోగించారు. విద్యుత్ అంతరాయం జరిగినా.. 360° హార్న్ స్పీకర్ వ్యవస్థ, ఒక కి.మీ పరిధిలో కూడా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసేలా ఏర్పాట్లు చేశారు.

Also Read:హరీష్‌కి పితృవియోగం..కేసీఆర్ సంతాపం

- Advertisement -