- Advertisement -
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు ఏపీ మంత్రి అల్లుడు. ఏపీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ ని బురిడీ కొట్టించారు కేటుగాళ్లు. పునీత్ పేరుతో కంపెనీ అకౌంటెంట్ కి మెసేజ్ పంపారు యూపీకి చెందిన ముగ్గురు సైబర్ నేరగాళ్లు.
అర్జెంట్ గా రూ.1.96 కోట్లు కావాలని మెసేజ్ రావడంతో నగదు ట్రాన్స్ ఫర్ చేశారు అకౌంటెంట్. అనంతరం సైబర్ క్రైమ్ జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో అరవింద్ కుమార్ తో పాటు సంజీవ్ అనే నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. మరోక నిందితుడు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
Also Read:సురవరం మృతి..ప్రముఖుల సంతాపం
- Advertisement -

