- Advertisement -
ఏపీ,తెలంగాణపై హ్యాకర్లు పంజా విసిరారు. టీఎస్ ఎస్పీడీసీఎల్, టీఎస్ ఎన్పీడీసీఎల్, ఎపీ ఎస్పీడీసీఎల్ వెబ్ సైట్లను ర్యాన్సమ్ వేర్ వైరస్ తో హ్యాక్ చేశారు. ఈ కంప్యూటర్లలోని సమాచారం మొత్తాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. తమ దగ్గర ఉన్న డేటాను అన్ లాక్ చేయడానికి రూ. 35 కోట్లు డిమాండ్ చశారు. అయితే డేటా అంతా బ్యాకప్ ఉండటంతో ముప్పు తప్పింది.
డిస్కంల సమాచారం హ్యాక్ అవడంతో అప్రమత్తమైన డిస్కంల అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో పోలీస్ అధికారులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఏపీ డిస్కం అధికారులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ సైబర్ దాడి అంతర్జాతీయ హ్యాకర్ల పని అయ్యుండొచ్చని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- Advertisement -