విండీస్ చెత్త రికార్డు..అత్యవసర సమావేశం

5
- Advertisement -

కింగ్‌స్ట‌న్ వేదిక‌గా ఆస్ట్రేలియా జ‌రిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ చెత్త రికార్డును న‌మోదు చేసింది. మిచెల్ స్టార్క్,బొలాండ్ ధాటికి కేవలం 27 పరుగులకే ఆలౌట్ అయి టెస్టుల్లో రెండో అత్యల్ప స్కోరు నమోదుచేసింది. స్టార్క్ ఆరు వికెట్లు తీయ‌గా స్కాట్ బొలాండ్ హ్యాట్రిక్‌తో చెల‌రేగాడు. విండీస్ బ్యాట‌ర్ల‌లో ఏడుగురు డ‌కౌట్లు కావ‌డం గ‌మ‌నార్హం.

వెస్టిండీస్ జట్టుపై తీవ్ర విమర్శల నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (CWI) తమ క్రికెట్ స్ట్రాటజీ కమిటిని అత్యవసరంగా సమావేశం కావాలని ఆదేశించింది. ఈ సమీక్షకు క్రికెట్ దిగ్గజాలు క్లైవ్ లాయిడ్, వివ్ రిచర్డ్స్, బ్రియాన్ లారా వంటి లెజెండ్స్‌ను ఆహ్వానించింది.

ఇప్పటికే కమిటీలో ఉన్న డాక్టర్ శివనారైన్ చంద్రపాల్, ది మోస్ట్ ఆనరబుల్ డెస్మండ్ హైన్స్, ఇయాన్ బ్రాడ్‌షా వంటి మాజీ దిగ్గజులతో కలిసి వీరు ఈ చర్చల్లో పాల్గొననున్నారు. మాజీ వెస్టిండీస్ స్పిన్నర్ దిననాథ్ రామనారైన్, CWIపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బోర్డు సభ్యులు తమకు నచ్చినంతగా జీతాలు వేసుకుంటారు, నైపుణ్యం కంటే వ్యక్తిగత విధేయత ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేస్తారు అని ఆరోపించారు. జాతీయ జట్టు గెలిచినా, ఓడినా, అంతర్జాతీయ స్థాయిలో అవమానకర పరాజయాన్ని ఎదుర్కొన్నా వాళ్లకు వ్యత్యాసం ఉండదు. వాళ్లు అధికారంలోనే ఉంటారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేవలం 27 పరుగులకు ఆలౌట్ కావడం – టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరు – మన క్రికెట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వెల్లడిస్తోంది. ఇది కేవలం ఓ పరాజయం కాదు,ఇది మన క్రికెట్‌కు తలవంచే రోజు , నైపుణ్యం గల ఆటగాళ్లను తయారుచేయలేని వ్యవస్థ, అన్‌ప్రిపేర్డ్ ఆటగాళ్లను ప్రపంచానికి ఎక్స్‌పోజ్ చేసే వ్యవస్థ అని ఫైర్ అయ్యారు.

Also Read:కొత్తపల్లిలో ఒకప్పుడు..పక్కా హిట్!

- Advertisement -