కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సిడబ్ల్యుసి ప్రశంస..

312
CWC team at Kaleshwaram project
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వాయు వేగంతో జరుగుతున్నట్టు ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సోమవారం నాడు ఆయన ప్రాజెక్టు పనులను తనిఖీ చేశారు. కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ మసూద్,తదితరులు మంత్రి వెంట ఉన్నారు. అనుకున్న రీతిలో పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. యుద్దప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని, రోజుకు 6000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వాడకం జరుగుతున్నదని అన్నారు.

CWC team at Kaleshwaram project

దేశంలో ఏ ప్రాజెక్ట్ కూడా ఇంత వేగంగా జరగలేదని చెప్పారు. ఇది ఒక రికార్డ్ అని అన్నారు. వచ్చే రెండు మూడు నెలలు కూడా ఇదే విధంగా జెట్ స్పీడ్‌తో పనులు జరగాలని అధికారులను ఆయన ఆదేశించారు. మహారాస్ట్ర ,తెలంగాణ రెండు వైపులా గోదావరి ఒడ్డున పనులు కూడా పూర్తిచేయాలని ప్రయత్నిస్తున్నామని అన్నారు. కేంద్ర జల సంఘం చైర్మన్ కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చారని తెలిపారు.

CWC team at Kaleshwaram project

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మెడిగడ్డ వద్ద తెలంగాణా రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కేంద్ర జలవనరుల చైర్మన్ మసూద్ హుస్సేన్ సందర్శించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో చేరుకున్నారు. వారికి హరీష్ రావు ప్రాజెక్ట్ పనులు సాగుతున్న తీరును వివరించారు ప్రాజెక్ట్ సి.ఇ.వెంకటేశ్వర్లు ప్రాజెక్ట్ రూపకల్పన, పనితీరు, ప్రాజెక్ట్ డిజైన్‌ల స్తితి గతులను సి.డబ్ల్యు. సి.బృందానికి తెలియ జేశారు.ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అని పనులు శర వేగంగా జరుపుతున్నారని సి.డబ్ల్యు.సి. చైర్మన్ మసూద్ అన్నారు. ఈ బ్యారేజ్ కింద జరిగే మొత్తం పంప్ హౌస్‌లను పరిశీలించినట్టు చెప్పారు.

CWC team at Kaleshwaram project

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం శివారులోని కాళేశ్వరం ప్రాజెక్ట్ 6వ ప్యాకేజి పనులను పరిశీలించిన సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ హుస్సేన్, మంత్రి హరీష్ రావు, సీఈ (ఐఎంవో- సీడబ్ల్యూసీ) నవీన్ కుమార, డైరెక్టర్ (ఐపి-ఎస్) బి.సి.విశ్వకర్మ, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్ర మూర్తి, మల్లెపల్లి లక్ష్మయ్య. ఈ ప్రాజెక్టు సందర్శనలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు, సీఈ వెంకటేశ్వర్లు, ఈ.ఈ నూనె శ్రీధర్ తోపాటు పలువురు ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.

CWC team at Kaleshwaram project

తెలంగాణ రాష్ట్రానికే కాళేశ్వరం ప్రాజెక్ట్ తలమానికం అని కేంద్ర జల సంఘం చైర్మన్ మసూద్ అన్నారు. గతంలో కూడా తన లాగే చాలమంది అధికారులు విజిట్ చెశారని, తాను ఉదయం నుండి కాళేశ్వరం మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం, 6,8 ప్యాకేజీ పనులు రామడుగు లక్ష్మి పూర్ టన్నేల్‌ను కూడా పరిశీలించానని తెలిపారు. అన్ని ప్రాంతాలలో పనులు చురుగ్గ వేగంగా సాగుతున్నాయన్నారు.

తెలంగాణ రాష్ట్రం గర్వించేలా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. దీనివలన ప్రజలకు రైతులకు త్రాగు నీటితో పాటు సాగు నీరు అందుతుందన్నారు. మంత్రి హరీశ్ రావు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మంత్రి హరీష్ రావు, ఆయన బృందం పని తీరును ప్రశంసించారు. పనులను విజయవంతంగా చేయిస్తున్నారని సి.డబ్ల్యు. సి.చైర్మన్ అన్నారు.

CWC team at Kaleshwaram project

అదికారులు ఇంజనీర్లు సమన్వయంతో, క్రమ పద్దతిలో నాణ్యతతో కూడిన పనులు చేపడుతున్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టు పనులు చాలా కష్టంతో కూడుకున్నవైనప్పటికి చాలా వేగవంతంగా చెస్తున్నారని సిడభ్లూసి చైర్మన్ మసూద్ హుస్సేన్ తెలిపారు.కరీంనగర్ జిల్లా రామడగు మండలం లక్ష్మిపూర్ టన్నేల్ ను కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆరవ ప్యాకేజీ సందర్శించిన అనంతరం మీడియా సమావేశంలో సిడభ్లూసి చైర్మన్ మసూద్ హుస్సేన్ మాట్లాడారూ.ఈ ప్రాజెక్టు సందర్శనలో ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు, సీఈ వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్ తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -