హిట్ కొట్టినట్టే.. ఫస్ట్ డే 9 కోట్లు

56
- Advertisement -

అక్కినేని ఫ్యాన్స్ కి ఎట్టకేలకు ఊరట కలిగింది. అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన కస్టడీ మూవీ ఈరోజు రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పైగా చైతు కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది. ఓవర్సీస్‌ సహా పలుచోట్ల ప్రీమియర్స్‌ కి సాలిడ్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడన్న అంచనా ప్రకారం మొదటి రోజు కస్టడీ సినిమా 9 కోట్లు వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. పైగా సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్లో పంచుకుంటున్నారు. సినిమా మెుదటి 30 నిమిషాలు స్లోగా సాగినా.. ఆ తర్వాత అదిరిపోయిందని పాజిటివ్ కామెంట్స్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.

నిజానికి కస్టడీ సినిమాకి రివ్యూలు పెద్దగా పాజిటివ్ గా రాకపోయినా, ప్రేక్షకుల నుంచి మాత్రం పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అందుతుంది. కస్టడీ సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ సూపర్బ్‌ అంటున్నారు. సెకండాఫ్‌ సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్‌ గా ఉందట. ఐతే, లవ్ ట్రాక్‌, రిపీటెడ్ సీన్స్‌ వంటివి సింపుల్ గా ఉన్నాయట. కానీ, నాగ చైతన్యతో పాటు మిగిలిన స్టార్ కాస్టింగ్ ఫుల్ కిక్ ఇచ్చింది అని అంటున్నారు. మొత్తానికి కస్టడీతో చైతు హిట్ కొట్టినట్టే. మరి హిట్ ఇచ్చిన ఊపులో చైతు ప్రస్తుతం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో తన కస్టడీ సినిమా గురించి, అలాగే ఇతర అంశాల గురించి కూడా ఓపెన్ గా మాట్లాడుతున్నాడు.

Also Read: అప్పుడు ఆమెకు 17, భర్తకు 7 ఏళ్లు

ఈ క్రమంలోనే దగ్గుబాటి హీరోలు వెంకటేష్‌, రానా నటించిన వెబ్‌సిరీస్ ‘రానానాయుడు’. దీనిపై ఫ్యామిలీ ప్రేక్షకుల నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా వెంకటేశ్ ఇందులో నటించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ విమర్శలపై నాగచైతన్య స్పందించారు. ‘వెంకటేష్‌గారికి ఫ్యామిలీ హీరో ఇమేజ్‌ ఉన్నమాట వాస్తవమే. నటుడు అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాలి.’ అని నాగ చైతన్య చెప్పుకొచ్చారు. ఇలా ‘రానానాయుడు’పై నాగచైతన్య కామెంట్స్‌ చేయడం విశేషం.

Also Read: HrithikRoshan:మీ అభిప్రాయం ఎంటీ..?

- Advertisement -