సీతాఫలం తింటే ఎన్ని ప్రయోజనాలో!

39
- Advertisement -

సీజనల్ గా లభించే పండ్లలో సీతాఫలం కూడా ఒకటి. చలికాలంలో మాత్రమే లభించే వీటిని పోషకాల ఘనిగా చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి సమ్మెలనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి ఎంతో అవసరం. కాబట్టి ఈ సీజన్ లో మాత్రమే లభించే సీతఫలాలను అసలు మిస్ కావద్దని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఐరన్ మరియు విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా జుట్టు సంరక్షణకు మెదడు పనితీరు మెరుగు పరిచేందుకు కూడా సహాయ పడుతుంది. ఇంకా రక్తహీనతతో బాధపడేవారు తప్పనిసరిగా సీతాఫలాన్ని తినాలని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడంతో పాటు, హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతాయి. .

తద్వారా రక్త హీనత దూరమౌతుంది. ఇంకా ఇందులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉంటాయి. అందువల్ల ఎటువంటి క్యాన్సర్ కారకాలనైనా ఎదుర్కొనే శక్తి శీతాఫలం నుంచి లభిస్తుంది. ఇంకా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు కూడా సీతాఫలం ఎంతో ప్రయోజనకారి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఇందులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. తద్వారా జీర్ణ శక్తి కూడా మెరుగుపడుతుంది. అలాగే మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. ఇంకా బరువు తగ్గాలనుకునే వారికి సీతాఫలం ఎంతో మేలు చేస్తుంది. ఇక ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు రక్త పోటును నియంత్రించడంలోనూ, గుండె సమస్యలను దూరం చేయడంలోనూ సహాయపడుతుంది. కాబట్టి ఎన్ని ఉపయోగాలు ఉన్న సీతాఫలాన్ని ఈ సీజన్ లో అసలు మిస్ అవోద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:Bigg Boss 7 Telugu:అమర్‌ని దొంగ చేసేశారు

- Advertisement -