నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఏవి మనం తినే ఆహారం విషయంలో ఎంతో అశ్రద్ద వహిస్తుంటాము. తద్వారా లేని సమస్యలను కొని తెచ్చుకొని అనారోగ్యం పాలౌతుంటాము. అందుకే మనం తినే ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని న్యూట్రీషియన్స్ చెబుతుంటారు. కాబట్టి మన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచే కొన్నిటి గురించి తెలుసుకుందాం.
పెరుగు
చాలమందికి భోజనం చేసిన తరువాత అనగా మద్యాహ్నం, రాత్రి సమయాల్లో పెరుగు తినే అలవాటు ఉంటుంది, అయితే కొందరు మాత్రం పెరుగును తినడానికి ఇష్టపడరు. కానీ ప్రతిరోజూ పెరుగు తినడం వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నాయి. పెరుగులో ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్ బి6, విటమిన్ 12, వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన పోషణను అందివ్వడంతో పాటు, పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. రోజు పెరుగు తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇంకా అధిక రక్తపోటు కూడా తగ్గుతుంది.
క్యారెట్
ప్రతిరోజూ క్యారెట్ తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇందులో ఉండే పొటాషియం, విటమిన్ ఏ, బయోటిన్, విటమిన్ బి6, వంటి ఖనిజాలు శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. కంటిచూపును మెరుగుపరచడం, శరీరంలో ప్రోటీన్ శాతాన్ని పెంచడం, ఎముకల్లో పటుత్వాన్ని పెంచడం వంటి ప్రయోజనలు కలుగుతాయి.
కరివేపాకు
సాధారణంగా మనం తినే కూరల్లో కరివేపాకు తప్పనిసరి. కానీ చాలమంది కరివేపాకు ను తీసి పక్కన వేస్తుంటారు. అలా అసలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకులో రక్త హీనతను తగ్గించే గుణాలు ఉంటాయి. అంతే కాకుండా బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చయడంతో పాటు జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.
ఖర్జూరం
రోజుకు రెండు ఖర్జూరలను తింటే మూత్ర సమస్యలు దరిచేరవు. ఇంకా కిడ్నీలలోని రాళ్ళను కరిగించే గుణాలు కూడా ఖర్జూరలో మెండుగా ఉంటాయి. ప్రతిరోజూ ఖర్జూర తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. ఇంకా కండర పుష్టి కూడా కలుగుతుంది. వీటితో కీరదోస, వాల్ నాట్స్,వంటివి కూడా ప్రతిరోజూ తినడం వల్ల ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు.
Also Read:కానుగ కషాయం తాగితే ఎన్ని లాభాలో!