తిరుమల వేంకటేశ్వరస్వామివారి వాహనసేవలలో దేశంలోని వివిధ రాష్ట్రాల కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని టీటీడీ జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి భవనంలో గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2023 శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులను విశేషంగా అలరించేలా ప్రముఖ కళాకారులతో సంగీత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలోని ఉత్తమ కళా బృందాలకు స్వామివారి వాహనసేవలలో ప్రదర్శనలు ఇచ్చేందుకు అహ్వానించాలన్నారు. తిరుమల నాదనీరాజనం వేదిక, ఆస్థాన మండపంలలో ఏర్పాటు చేసే కార్యక్రమాలు అత్యద్భుతంగా ఉండాలన్నారు.తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసే భక్తి సంగీత కార్యక్రమాలు పురప్రజలను ఆకట్టుకునేలా ఉండాలన్నారు. తిరుమలకు వచ్చే కళాకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన రవాణా, వసతి సౌకర్యాలు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు.
Also Read:సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ