చెన్నై మ్యాచ్ చెన్నైలోనే…

217
CSK to play IPL 2018 matches in Chennai-Rajeev Shukla
- Advertisement -

తమిళనాడులో కావేరీ జలాల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే. దానికి మద్దతుగా సినీ సినీ ప్రముఖులు కూడా నిరసన తెలియజేసారు. తమిళ సూపర్ స్టార్ ఐపీఎల్ పై మండిపడ్డ విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో చెన్నైలో ఐపీఎల్ నిర్వహించడం సరికాదని రజనీకాంత్ సూచించారు. ఐపీఎల్ నిర్వహిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, అందుకని చెన్నైలో జరిగే మ్యాచులు కేరళలో నిర్వహించవచ్చన్న వార్తలు వినిపించాయి.

CSK to play IPL 2018 matches in Chennai-Rajeev Shukla

అయితే అలాంటి ఆలోచన ఏమీ లేదని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శెక్లా స్పష్టం చేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడామని, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కల్గకుండా వాళ్లు హామీ ఇచ్చినట్లు శుక్లా తెలియజేశారు. మంగళవారం చెన్నై, కోల్ కత్తా మ్యాచ్ కూడా చెన్నైలోనే జరుగుతుందని ఆయన చెప్పారు. దయచేసి ఐపీఎల్ ను రాజకీయ వివాదాల్లోకి లాగొద్దని శుక్లా పేర్కొన్నారు. ఆటను ఆటగానే చూడాలని శాక్లా అన్నారు

- Advertisement -