పంజాబ్‌ను చిత్తుగా ఓడించిన చెన్నై..

204
csk
- Advertisement -

ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా బోణి కొట్టింది చెన్నై. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టి 6 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌తో పంజాబ్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది.

పంజాబ్ విధించిన 107 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కొల్పోయి మాత్రమే చేధించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (5) విఫలమైనా మరో ఓపెనర్ డుప్లెసిస్‌ (36 నాటౌట్: 33 బంతుల్లో 3×4, 1×6),మొయిన్ అలీ (46: 31 బంతుల్లో 7×4, 1×6) ,సురేశ్ రైనా (8: 9 బంతుల్లో 1×4) రాణించారు.

అంతకముందు టాస్ గెలిచిన ధోని బౌలింగ్ ఎంచుకోగా మహీ అంచనాలకు తగ్గట్టే ఇరగదీశాడు దీపక్ చాహర్. అద్బుత బౌలింగ్‌తో బెంగళూరుకు చుక్కలు చూపించాడు. తన కెరీర్‌లోనే బెస్ట్ 4/13తో రాణించాడు. యువ హిట్టర్ షారూక్ ఖాన్ (47: 36 బంతుల్లో 4×4, 2×6) ఒక్కడు మాత్రమే రాణించగా మిగితా ఆటగాళ్లంతా విఫలమయ్యారు.

- Advertisement -