ఐపీఎల్ 2025లో భాగంగా ఎట్టకేలకు ఘన విజయం సాధించింది సీఎస్‌కే. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 167 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన చెన్నై.. 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. చెన్నై బ్యాటర్లలో శివమ్ దూబె (43 నాటౌట్; 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రచిన్ రవీంద్ర (37; 22 బంతుల్లో 5 ఫోర్లు), షేక్ రషీద్ (27; 19 బంతుల్లో 6 ఫోర్లు), ఎంఎస్ ధోని (26 నాటౌట్; 11 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించారు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో…20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.కెప్టెన్ రిషబ్ పంత్ 49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేయగా మిచెల్ మార్ష్ (30), ఆయుష్ బదోని (22)లు పర్వాలేదనిపించారు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా, మతీషా పతిరణా చెరో రెండు వికెట్లు తీశారు. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ లు తలా ఓ వికెట్ తీశారు.
Also Read:ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా గంగూలీ

