వికారాబాద్‌లో కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు..

235
cs somesh
- Advertisement -

వికారాబాద్, జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు వ్యాప్తి చెందకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లాలో ఎక్కువగా పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్ర శేఖర్ రావు ఆదేశాల ననుసరించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో డి.జి.పి.మహేందర్ రెడ్డి,రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జిల్లా ప్రత్యేక అధికారి రాజత్ కుమార్ సైని లతో కూడిన ఉన్నత స్థాయి బృందం బుధ వారం వికారాబాద్ జిల్లా లో పర్యటించారు. జిల్లా కలెక్టర్ పౌసమి బసు, జిల్లా ఎస్.పి. నారాయణలతో సమావేశమై కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన నేపథ్యంలో కారణాలు,కొత్త కేసులు రాకుండా తీసుకో వలసిన చర్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా సి.ఎస్.సోమేశ్ కుమార్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో 38 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు, ప్రజలు ఆందోళన చెంద వద్దని,జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారం అందిస్తామని తెలిపారు.కొత్త కేసులు నమోదు కాకుండా జిల్లా కలెక్టర్,ఎస్.పి.లు నేతృత్వం లో అన్ని శాఖలు కలిసి కట్టుగా కృషి చేయాలని అన్నారు. ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను అభినందిస్తూ యంత్రాంగంకు సహకారంగా వుండేందుకు ఐ.ఏ.ఎస్.అధికారి రజత కుమార్ సైని ని ప్రత్యేక అధికారిగా, వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని,నియమించినట్లు తెలిపారు.హెల్త్, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, వ్యవసాయ శాఖ,మార్కెటింగ్ శాఖలు పని చేస్తున్నారని, మెడికల్,రెవెన్యూమున్సిపల్, పోలీసు శాఖలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు.

పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రే సింగ్ పకడ్బందీగా చేయాలీ అన్నారు.నిన్న పాజిటివ్ వచ్చిన కేసుల నుండి మొదలు పెట్టాలని, పాత కేసులు రివ్యూ చేయాలని అన్నారు. పోలీస్ ,హెల్త్, మున్సిపల్ శాఖలు కలిసి కట్టుగ పనిచేయాలని,టెక్నాలజీ వినియోగించు కోవాలని అన్నారు.ప్రైమరీ కాంటాక్ట్ వున్న వారిని క్వారం టైన్ కు తరలించి పరీక్షలు నిర్వహించాలి,ప్రైమరీ కాంటాక్ట్ నూరు శాతం పరీక్షలు నిర్వహించాలని అన్నారు. పాజిటివ్ వస్తే గాంధీకి తర లించాలని,నెగెటివ్ వస్తే నిర్దేశిత సమయం క్వారంటైన్ లో వుంచి, పూర్తి అయిన తర్వాత స్టాంప్ వేసి వేయాలని అన్నారు.

కంటైన్‌మెంట్ ప్రాంతాలు మరింతగా పటిష్టం చేయాలి,ఆ ప్రాంతం నుండి ఎవ్వరూ బయటికి రాకుండా చూడాలి ,చీమ కూడా లోనికి పోవద్దు,బయటికి రావద్దని,అర్&బి శాఖ బారి కెడింగ్ ఇంకా పటిష్టం చేయాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి బయటికి వాస్తే ప్రభుత్వ క్వా రంటైన్ కు తరలించాలని అన్నారు.ఆ ప్రాంతాలలో నిత్యావసర వస్తువుల సరఫరా, పాలు, గాయాల సరఫరా పక్కగా జరగాలి అన్నారు.సోడియం హైపో క్లోరైడ్ పిచి కారీ చేయాలని అన్నారు.అన్ని వాణిజ్య సంస్థలు మూసి వేయాలని అన్నారు. క్వారం టైన్ కేంద్రాలు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్వహించాలి, పారిశుధ్యం, ఆహారం,సామాజిక దూరం పాటించాలని అన్నారు.ప్రైమరీ కాంటాక్ట్ వారికి కేంద్ర ఆరోగ్య శాఖ,ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన నిబంధనలు అనుసరించాలి,వైద్య పరీక్షలు,మందులు ప్రొటోకాల్ పాటించి అందచేయాలని అన్నారు.రిపోర్టింగ్ చేయాలని అన్నారు.డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ ఇక్కడే వుండి మానిటర్ చేస్తారని అన్నారు.

వైద్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శాంతి కుమారి మాట్లాడుతూ క్వరుంటాయిన్ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య బృందాలు ప్రతి రోజూ ఇంటింటి సర్వే చేసి ఉదయం,సాయంత్రం వైద్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ప్రతి వారికి మాస్క్ లు అందచేయాలని,ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులలో జ్వర పీడితులకు ప్రత్యేకంగా పరీ క్షేంచెందుకు తగిన ఏర్పాటు చేయాలని అన్నారు.ప్రతి రోజూ రిపోర్టింగ్ చేయాలని అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రులలో ఇన్‌పెక్షన్ నిరోధ చర్యలు చేపట్టాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ పౌసమి బసు, ఎస్.పి. నారాయణ జిల్లాలో కరోనా నియంత్రణ కు తీసుకున్న చర్యలను వివరించారు.జిల్లాలో ఇప్పటి వరకు 38 పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 08 కాంటైన్‌మెంట్ ప్రాంతంలు ఏర్పాటు చేసి నట్లు తెలిపారు. 06 క్వారాంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి నట్లు,నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు వివరించారు.వచ్చే వారం రోజుల్లో కరోనా కేసులు వ్యాప్తి చెంద కుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -