ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌పై సీఎస్ రివ్యూ

4
- Advertisement -

సచివాలయంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పర్యవేక్షణ కోసం ఏర్పాటైన మేనేజ్‌మెంట్ కమిటీ మొదటి సమావేశం జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ కొడంగల్‌, మధిర నియోజకవర్గం, లక్ష్మీపురం గ్రామంలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణ పనులను వచ్చే నెలాఖరులోగా ప్రారంబించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో పరిపాలనా అనుమతుల కోసం ప్రతిపాదనలు సమర్పించేందుకు అనుసరించాల్సిన విధానాలు, ప్రతిపాదనల ప్రక్రియకు నోడల్ విభాగం ఖరారుపై చర్చించారు. సమీకృత రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్వహణ, రెసిడెన్షియల్‌ పాఠశాలలకు భూములు కేటాయించడంపై సమావేశంలో చర్చించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రతివారం సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్‌రాజు, ముఖ్య కార్యదర్శులు నవీన్‌ మిట్టల్‌, బి వెంకటేశం, సందీప్‌ కుమార్‌ సుల్తానియా, శ్రీధర్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణభాస్కర్‌, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Also Read:‘మత్తువదలరా2’ కు అదిరే రెస్పాన్స్

- Advertisement -