లాక్‌డౌన్‌.. వైన్స్‌షాపుల వద్ద మందు బాబుల క్యూ..

209
liquor shops
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఈ నెల 12 నుంచి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది. దీంతో మందు బాబుల మదిలో ఆందోళ మొదలైంది. లాక్‌డౌన్‌ కదా.. వైన్స్‌షాపులు అందుబాటులో ఉంటాయో.! లేదోనన్న సందేహంతో మద్యం దుకాణాల వద్ద క్యూ కట్టారు. హైద్రాబాద్‌ నగరంలోని చాలా ప్రాంతాల్లో వైన్స్‌ షాపుల ఎదుట మద్యం ప్రియులు బారులుదీరడం కనిపిస్తున్నది.

కరోనా విజృంభిస్తున్నా పట్టించుకోకుండా గుంపులు గుంపులుగా దుకాణాల ఎదుట పోగవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దుకాణాల ఎదుట రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మాస్కు ధరించని వారిని వెనక్కు పంపుతున్నారు. భౌతికదూరం పాటించాలని మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన వారికి సూచిస్తున్నారు.

- Advertisement -