తెలంగాణ బీజేపీ..ఎవరి దారి వారిదే?

12
- Advertisement -

తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది?, పార్టీకి కొత్త బాస్ ఎవరొస్తారు?, సీనియర్ నేతలు ఎవరి దారి వారే ఎందుకు చూసుకుంటున్నారు?, 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నా కేడర్‌కు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నారు?, ఇప్పుడు ఇదే సగటు బీజేపీ కార్యకర్తను వేధిస్తున్న ప్రశ.

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని పైకి పదేపదే చెబుతూ వస్తున్న బీజేపీ నేతలు, లోలోపల మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారట. అందుకే పార్టీ భవిష్యత్‌ ఎన్నికలు, విస్తరణ అజెండాతో బీజేపీ ఓ మీటింగ్‌కు పిలుపునివ్వగా ఒక్క నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే తప్ప మిగితా వరందరూ డుమ్మా కొట్టారు. కనీసం బీజేఎల్పీ ఫ్లోర్ లీడర్ హాజరుకానీ పరిస్థితి నెలకొంది.

ఇక కొత్త అధ్యక్షుడి ఎన్నిక నేతలకు తలనొప్పిగా మారింది. . పార్టీలో తొలి నుంచి ఉన్న నేతలకే అవకాశమివ్వాలని సీనియర్‌ నేతలు సూచిస్తుండగా ఇటీవల చేరిన వారు సైతం పదవి ఆశీస్తుండటంతో ఏటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. ఒరిజనల్‌ బీజేపీ కోటాలో మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, గంగిడి మనోహర్‌ రెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన కోటాలో ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు ఆశలు పెట్టుకున్నారు. ఎవరికి వారే అధ్యక్ష పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా ఏ ఒకరికి పదవి దక్కినా మిగితా వారి వర్గం సహకరించే పరిస్థితి కనిపించడం లేదు.

ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి కావడంతో బిజీ అయిపోయారు. దీంతో పార్టీ వ్యవహారాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. అంతేగాదు కొత్త అధ్యక్షుడి ఎంపికలోనూ సైలెంట్ అయ్యారు. మొత్తంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ఆ పార్టీ నేతలకు తీవ్ర తలనొప్పిగా మారింది.

Also Read:TTD:అంగ ప్రదక్షిణ టోకెన్లు ఆన్‌లైన్ కోటా

- Advertisement -