పెళ్లిలోను క్రికెట్‌ ను వదలని యువరాజ్‌

256
- Advertisement -

online news portal

వై.హెచ్.పి.ఎల్.. దీని గురించి మీరు విన్నారా..? చివరి పి.ఎల్. చూస్తుంటే.. ఇదేదో ప్రీమియర్ లీగ్ లానే ఉందని అనుకుంటున్నారా..! కరెక్టే.. అలాంటి లీగే.. కానీ ఇది యువరాజ్ సింగ్ , హేజెల్ కిచ్ ప్రీమియర్ లీగ్! ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న హేజెల్ పరిణయమాడబోతున్నాడు. పెళ్లి ముహుర్తం దగ్గరపడుతున్న తరుణంలో పెళ్లి పనులు మొదలెట్టారు. ఇక పెళ్లి కార్డు విషయంలో చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారు యువీ-హీచ్ జంట. రొటీన్ కి భిన్నంగా తమ పెళ్లి కార్డులపై ఫొటోలకు బదులు… కార్టూన్లూ ఇల్లస్ట్రేషన్లతో డిజైన్ చేయించారు.

క్రికెట్ థీమ్ తో ఈ కార్టూన్లు వేయించారు. దీన్ని బట్టి యూవీకి క్రికెట్ పై ఎంత ప్రేముందన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ శుభలేఖలో ‘సంగీత్’ ఆహ్వాన పత్రంపై కీచ్ బ్యాట్ పట్టుకుని ప్యాడ్స్ కట్టుకుని ఉన్న క్యారికేచర్ ను ప్రచురించారు. రిసెప్షన్ కు ఇచ్చిన ఆహ్వానంలో పిచ్ మధ్యలో నిలుచున్న కొత్త జంటను చూసి ‘భాయ్… షాదీ…’ అంటున్న ఇతర క్రికెటర్ల క్యారికేచర్లు ప్రచురించారు. ఇక ప్రధాన చిత్రంగా, పిచ్ మధ్య డోలు వాయిస్తున్న యువరాజ్, నృత్యం చేస్తున్న కీచ్ చిత్రాలున్నాయి.

online news portal

ఇక పెళ్లి వేడుకలను ఈ జంట భారీగా ప్లాన్ చేస్తున్నారు. మామూలుగా అయితే ఒక వెడ్డింగ్ ప్లానర్ ని పిలిచి పెళ్లి హంగామా బాధ్యతలు అప్పగిస్తూ ఉంటారు. అక్కడి నుంచీ ఈవెంట్ మేనేజర్లే ఏర్పాట్లు చూసుకుంటారు. వధూవరులు హాయిగా ముచ్చట్లు పెట్టుకుంటూ టైంపాస్ చేసుకుంటారు. కానీ ఈ జంట మాత్రం అలాకాదు. తమ పెళ్లి పనుల్ని తామే దగ్గరుండి చూసుకుంటున్నారు. ప్రతీ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు.

పెళ్లికి వస్తున్న అతిథులకు ఎలాంటి స్వీట్లు పెట్టాలీ…? ఫంక్షన్ హాల్లో ఎలాంటి సెంటు కొట్టాలి..? వచ్చే అతిథులకు ఎలా స్వాగతం పలకాలీ… ఇలా అన్ని విషయాలనూ జంటగా ఫైనలైజ్ చేస్తున్నారట! ఇక పెళ్లి విషయానికొస్తే… రెండుసార్లు ఈ జంట వివాహం చేసుకుంటుంది! గురుద్వార సంప్రదాయం ప్రకారం నవంబర్ 30 చంఢీగడ్ లో పెళ్లి జరుగుతుంది. ఆ తరువాత హిందూ సంప్రదాయం ప్రకారం గోవాలో డిసెంబర్ 2న పెళ్లి జరుగుతుంది. సంగీత్ – రిసెప్షన్లు ఢిల్లీలో ఏర్పాటు చేశారు. సంగీత్ కార్యక్రమాన్ని చత్తాపూర్ ఫామ్ హౌస్లో జరిగితే రిసెప్షన్ హోటల్లో ఉంటుంది. మొత్తానికి యువరాజ్ పెళ్లి వేడుకలు ఓ రేంజిలో ఉండబోతున్నాయి.

- Advertisement -