- Advertisement -
టీమిండియా సీనియర్ జట్టుకు వరల్డ్ కప్ అందించడమే తన ముందున్న లక్ష్యమని భారత అండర్ 19 మహిళల జట్టు ప్లేయర్ త్రిష. జట్టు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందన్నారు. మరింత కష్టపడి సీనియర్ జట్టులో చోటు సాధించడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు.
తన ప్రతి విజయంలో నాన్న ఉన్నారన్నారు. ద్రితి మంచి ప్లేయర్ అని, ఈ సారి అవకాశం రాలేదని వెల్లడించారు. అమ్మాయిలు స్పోర్ట్స్‌ను తమ కెరీర్‌గా ఎంచుకోవచ్చని, సత్తా చాటితే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు.
అండర్ -19 టీ20 వరల్డ్ కప్ స్టార్ క్రికెటర్ త్రిషాకు శంషాబాద్ విమానాశ్రయంలో హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ఘన స్వాగతం పలికారు.ఈ టోర్నమెంట్ సందర్భంగా, త్రిష మొత్తం 309 పరుగులు చేసి ఏడు వికెట్లు పడగొట్టి రాణించింది.
Also Read:ఉపవాసంతో క్యాన్సర్‌కి చెక్!
- Advertisement -