“టీమ్‌5” టీజ‌ర్ రిలీజ్‌..

248
Cricketer Sreesanth movie Team 5 official teaser Released
- Advertisement -

మాజి క్రికెట‌ర్ శ్రీశాంత్ హీరోగా త‌న మూడ‌వ చిత్రంగా మ‌ల్టిలాంగ్వెజస్ లో రాజ్ జ‌కారియాస్ నిర్మాత‌గా సెల‌బ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కిస్తున్న చిత్రం టీమ్‌5. ఈ చిత్రం ద్వారా సురేష్ గొవింద్ ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మే రెండ‌వ వారంలో విడుద‌ల కానున్న ఈ చిత్రానికి గొపిసుంద‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించి తెలుగు వెర్ష‌న్ టీజ‌ర్ ని హీరో శ్రీశాంత్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు.
 Cricketer Sreesanth movie Team 5 official teaser Released
ఈ సంద‌ర్బంలో హీరో శ్రీశాంత్ మాట్లాడుతూ..” నేను హీరోగా చేస్తున్న మూడ‌వ చిత్రం ఇది. నా చిత్రం తెలుగులో కూడా విడుద‌ల కావ‌టం హ్యీపీగా వుంది. ఇది రేస్ బేస్డ్ సబ్జ‌క్ట్ చాలా కొత్తగా వుంటుంది. నిక్కి గ‌ల్రాని నాకంటే చిన్న‌ది కాని ఇక్క‌డ నాకంటే చాలా పెద్ద‌ది. త‌న ద‌గ్గ‌ర యాక్టింగ్ కి సంభందించి చాలా నేర్చుకున్నాను. ప్రోడ్యూస‌ర్ రాజ్ చాలా ఇష్ట‌ప‌డి చేస్తున్నారు.

అల్‌మోస్ట్ ఇండియాలో వున్న అన్ని భాష‌ల్లో చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. హింది, తెలుగు, త‌మిళం. మ‌ళ‌యాలం, మ‌రాఠి, భోజ్ పురి, ఒరిస్సా అలా అన్ని భాష‌ల్లో చేస్తున్నారు. ద‌ర్శ‌కుడు సురేష్ గొవింద్ చాలా టాలెంటెడ్ ప‌ర్స‌న్ ఆయ‌న‌కి మంచి భ‌విష్య‌త్తు వుంది. “అని అన్నారు
 Cricketer Sreesanth movie Team 5 official teaser Released
హీరోయిన్ నిక్కి గ‌ల్రాని మాట్లాడుతూ..” నా చిత్రాల‌న్ని తెలుగులో విడుద‌ల‌వుతున్నాయి. రెండు వారాల‌కి ఒక్క‌సారి నేను హైద‌రాబాద్ వస్తున్నాను. ఇలా న‌న్ను తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర చేస్తున్న నిర్మాత‌ల‌కి నా ధ‌న్య‌వాదాలు. ఈ చిత్రం చాలా ఢిఫ‌రెంట్ ప్యాట్ర‌న్ లొ సాగుతుంది. ల‌వ్‌, ఎమెష‌న్స్‌, ఎంట‌ర్‌టైన్ మెంట్ పుష్క‌లంగా వుంటుంది.

ప్రోడ్యూస‌ర్, డైర‌క్ట‌ర్ కి చాలా మంచి పేరు వ‌స్తుంది. ఇక శ్రీశాంత్ గురించి చెప్పాలంటే నేను కాలేజ్ డేస్ వున్న‌ప్ప‌టి నుండి ఆయ‌న క్రికేట‌ర్‌.. ఆయ‌న‌కి నేను మంచి అభిమానిని ఇప్పుడు ఇలా ఆయ‌న ప‌క్క‌న చేయ‌టం హ్యీపీగా వుంది. మాస్ అండ్ రొమాంటిక్ హీరోగా శ్రీశాంత్ సెటిల‌వుతార‌నేది నిజం. ఈ చిత్రం మేలో విడుద‌ల కానుంది.” అని అన్నారు

నిర్మాత రాజ్ జ‌కారియాస్ మాట్లాడుతూ..” శ్రీశాంత్‌, నిక్కి గ‌ల్రాని లు జంట‌గా చేస్తున్న టీం5 చిత్రం షూటింగ్ పూర్త‌యింది. గోపిసుంద‌ర్ గారు ఆడియో ఈ చిత్రానికి హైలెట్ గా వుంటుంది. సురేష్ మంచి క‌థ‌తో చాలా అందమైన ఎమెష‌న‌ల్ గా తెర‌కెక్కించాడు. మే మెద‌టివారంలో మెత్తం యూనిట్ తో వ‌చ్చి ఆడియో ఫంక్ష‌న్ చేసి చిత్రాన్ని మే రెండ‌వ వారంలో విడుద‌ల చేస్తాము.. “అని అన్నారు.

- Advertisement -