క్రెడాయ్ ప్రాపర్టీ షో …ప్రారంభం

477
credai
- Advertisement -

క్రెడాయ్ హైదరాబాద్ ప్రోపర్టీ షో (ఈస్ట్) ప్రారంభం అత్యంత విశ్వసనీయమైన ప్రోపర్టీ షో – క్రెడాయ్ హైదరాబాద్ ప్రోపర్టీ షో (ఈస్ట్) 2019లో హైదరాబాద్ యొక్క తూర్పు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వృద్ధి సామర్థ్యం ప్రదర్శించనున్నారు హైదరాబాద్ , 09 నవంబర్ 2019 8 దేశంలోని రియల్ ఎస్టేట్ డెవలపర్లతో కూడిన అత్యున్నత సంస్థ కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్), నేడు క్రెడాయ్ హైదరాబాద్ ప్రోపర్టీ షో (ఈస్ట్) 2019ను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, డాక్టర్స్ కాలనీ, రంగారెడ్డి జిల్లా కోర్టు ఎదురుగా, ఎల్ బీ నగర్, కొత్త పేట వద్ద ప్రారంభించింది.

ఈ షో ప్రధాన లక్ష్యం, నగరంలోని తూర్పు ప్రాంతంలో డెవలపర్లకు మరియు గృహ కొనుగోలుదారులకు వృద్ధి చెందుతున్న అవకాశాలను ప్రదర్శించడం. ఈ ప్రదర్శనను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖామాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మరియు గౌరవ అతిథి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి, ఫ్యాక్టరీలు శాఖామాత్యులు సీహెచ్ మల్లారెడ్డి సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పీ రామకృష్ణారావు, అధ్యక్షులు ; శ్రీవీ రాజ్ శేఖర్ రెడ్డి-జనరల్ సెక్రటరీ; శ్రీ సీజీ మురళీమోహన్, శ్రీ కంచం రాజేశ్వర్; శ్రీ వీ వేణు వినోద్ ; శ్రీ ఎన్ జైదీప్ రెడ్డి- ఉపాధ్యక్షులు; శ్రీ ఆదిత్య గౌడ – ట్రెజరర్; శ్రీ శివరాజ్ ఠాకూర్ మరియు శ్రీ కొత్తపల్లి రాంబాబు- జాయింట్ సెక్రటరీలతో పాటుగా క్రెడాయ్ హైదరాబాద్ మేనేజింగ్ కమిటీ సభ్యులు, ప్రోపర్టీ షో కన్వీనర్ శ్రీ ఎం శ్రీకాంత్, కో-కన్వీనర్ (ఎల్ బీనగర్) శ్రీ మారం సతీష్ కుమార్, కో-కన్వీనర్ (ఉప్పల్) శ్రీ టీ శశికాంత్ రెడ్డి మరియు ఇతర ముఖ్య అతిథులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు నవంబర్ 9 మరియు నవంబర్ 10 తేదీలలో సరూర్‌నగర్ జరిగే ఈ షో ద్వారా నగరంలోని తూర్పు ప్రాంతానికి చెందిన రియల్టర్లు, బిల్డింగ్ మెటీరియల్ తయారీదారులు, కన్సల్టెంట్లు మరియు ఆర్థిక సంస్థలు రియల్ ఎస్టేట్ రంగంలో వస్తోన్న మార్పులు, సరికొత్త ప్రాజెక్టులను ఒకే చోట ప్రదర్శించనున్నారు.

ఈ షోలో 62 కు పైగా స్టాల్స్ ద్వారా అపార్ట్ మెంట్లు, విల్లాలు, ప్లాట్స్, వాణిజ్య ప్రదేశాలు సహా 5వేలకు పైగా క్రెడాయ్ ప్రోపర్టీ షో ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో శ్రీ పీ రామకృ ష్ణారావు, అధ్యక్షులు, క్రెడాయ్ హైదరాబాద్ మాట్లాడుతూ ” హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ గణనీయంగా వృద్ధి చెందుతుంది. ఆర్ధిక వ్యవస్థ విపరీతమైన ఒత్తిడిలో ఉండటంతో పాటుగా ఇతర సుప్రసిద్ధ రియల్ ఎస్టేట్ రంగాలైనటువంటి ఢిల్లీ ఎన్ సీఆర్, ముంబై, బెంగళూరులో వృద్ధి తిరోగమనంలో ఉంది. నగరంలో ప్రపంచశ్రేణి మౌలిక వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం, విద్యావంతులైన మరియు కాస్మోపాలిటన్ ప్రజలు, అత్యుత్తమ మౌలికవసతుల సదుపాయాలు మరియు కనెక్టివిటీ వంటివి నగరంలో పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. రాష్ట్రంలోని చురుకైన ప్రభుత్వం ‘లుక్ ఈస్ట్ పాలసీ’ తీసుకురావడంతో పాటుగా ఇప్పుడు అభివృద్ధిని తూర్పు వైపు దృష్టి సారించడం ద్వారా నగరం మొత్తం అభివృద్ధి చెందేందుకు ప్రణాళికలు రూపొందించింది. మరీ ముఖ్యంగా ఉప్పల్, ఎల్ బీనగర్, కీసర, సాగర్ రోడ్, విజయవాడ రోడ్ ఆదిభట్ల మొదలైన ప్రాంతాలు ఇప్పుడు మరింతగా అభివృద్ధి చెందనున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఐటీ అభివృ ద్ధిని నగరంలోని తూర్పు ప్రాంతానికి విస్తరించేందుకు దృష్టి సారించింది.

వీటితో పాటుగా పరిశోధన, కన్సల్టింగ్, ఎనలిటిక్స్, ఫైనాన్షియల్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ మరియు తయారీ రంగాలు సైతం నగరంలో కార్యకలాపాలు విస్తరించడం ద్వారా మొత్తంమ్మీద అభివృద్ధి ప్రణాళికలకు తోడ్పాటునందించనున్నాయి. నగరాభివృద్ధిలో భాగంగా ప్రత్యామ్నాయ అభివృద్ధికి తూర్పు వైపు అత్యుత్తమ మార్గంగా నిలువనుంది. ఈ ప్రాంతానికి మెట్రో కనెక్టివిటీ నాగోలు నుండి హైటెక్ సిటీకి కలిగి ఉండటంతో పాటుగా ఓఆర్ఆర్ కు సమీపంలో ఉంది. ప్రస్తుత తక్కువ అద్దెలు, ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు వంటివి ఆఫీస్ కాంప్లెక్స్ స్టు మరియు మాల్స్ లో తాజా పెట్టుబడులను ఆకర్షించడంతో పాటుగా నగర తూర్పు భాగం అభివృద్ధికి తోడ్పడనున్నాయి. బలీయమైన మౌలిక వసతులు మరియు నగరంలోని ఈ భాగం యొక్క అభివృద్ధికి ప్రభుత్వం దృష్టి సారించడం వల్ల, ఈ ప్రాంతంలో భారీ అభివృద్ధి జరుగనుందని మేము ఆశిస్తున్నాం. క్రెడాయ్ హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ ప్రోపర్టీ షో -ఈస్ట్ తొలి ఎడిషన్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. తద్వారా ఈ ప్రాంతంలో ప్రస్తుత,రాబోయే ప్రాజెక్టుల వివరాలను ప్రదర్శిస్తున్నాం. ప్రస్తుతం ఆస్తుల ధరలు తక్కువగా ఉన్నాయి. అందువల్ల గణనీయంగా ఆస్తుల ధరలు పెరుగక మునుపే తమకు నచ్చిన ప్రోపర్టీలను నగరవాసులు సొంతం చేసుకునేందుకు ఇది చక్కటి అవకాశం” అని అన్నారు.

వీ రాజశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ-క్రెడాయ్ హైదరాబాద్ మాట్లాడుతూ “ గత కొద్ది క్వార్టర్లుగా హైదరాబాద్ లో గృహ మరియు వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్లలో గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది. ఇప్పటి వరకూ పశ్చిమ ప్రాంతంలో అధికంగా అభివృద్ధిని నగరం నమోదుచేసుకుంది. ఒకవైపే నగరం అభివృ ద్ధి చెందడం వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనం పెద్దగా ఉండదు. ముందుచూపున్న నాయకత్వం కలిగిన రాష్ట్రంలో, ఇప్పుడు అభివృద్ధిని తూర్పు వైపు దృష్టి సారించడం ద్వారా నగరం మొత్తం అభివృద్ధి చెందేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పుడు ప్రభుత్వం సైతం లుక్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఐటీ అభివృద్ధిని నగరంలోని తూర్పు ప్రాంతానికి విస్తరించేందుకు దృష్టి సారించింది. వృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ తో పాటుగా ఐటీ కారిడార్ మరియు ఇతర పరిశ్రమల కోసం లుక్ ఈస్ట్ అంటూ ప్రభుత్వం ప్రణాళిక చేయడం ద్వారా నగరంలో ఇప్పుడు తూర్పు ప్రాంతంలో అభివృద్ధి వేగంగా జరుగనుంది. తద్వారా ఈ ప్రాంతంలో గృహ ఆస్తులకు సైతం డిమాండ్ గణనీయంగా పెరగనుంది. మేమిప్పుడు క్రెడాయ్ హైదరాబాద్ ప్రోపర్టీ షో (ఈస్ట్) మొదటి సంచికకు ప్రణాళిక చేశాం. తద్వారా ఈ ప్రాంతంలో వృద్ధికి ఉన్న అవకాశాలు వెల్లడిస్తూనే, తూర్పు హైదరాబాద్ లో మా సభ్యుల యొక్క అత్యుత్తమ ప్రోపర్టీలను సైతం ప్రదర్శించబోతున్నాం” అని అన్నారు.

క్రెడాయ్ : భారతదేశపు రియల్ ఎస్టేట్ పరిశ్రమ గొంతుక : కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్)ను 1999లో గృహ మరియు వసతి ప్రొవైడర్ల అవసరాలను తీర్చే రీతిలో ప్రారంభించబడింది. అప్పటి నుంచి ఇది తమ సభ్యుల సంఖ్యను గణనీయంగా వృద్ధి చేసుకుంటూనే ఉంది. ప్రస్తుతం 205 సిటీ చాప్టర్లు, 21రాష్ట్ర ఫెడరేషన్ ద్వారా 12500 మంది డెవలపర్లకు క్రెడాయ్ ప్రాతినిధ్యం వహిస్తుంది. తాజా పరిశ్రమ సమాచారం, సాంకేతికత, అత్యాధునిక ఆవిష్కరణలు మరియు బెంచ్ మార్క్స్ ను తమ సభ్యుల నడుమ పంచుకునే నెట్ వర్క్ గా క్రెడాయ్ వ్యవహరిస్తుంది. పారదర్శకత మరియు కొనుగోలుదారుల ప్రయోజనాలను రక్షించే ప్రయత్నాలను ఇది కొనసాగిస్తుంది. బలీయమైన భారతదేశం నిర్మించడం క్రెడాయ్ ప్రధాన లక్ష్యం. దీనితో పాటుగా అందరికీ గృ హాలను అందించాలనే నిబద్ధతకు కట్టుబడి ఉందన్నారు.

- Advertisement -