తాడేపల్లిలో వైసీపీ ఆఫీస్ కూల్చివేత

16
- Advertisement -

ఏపీలోని తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ ఆఫీస్‌ని కూల్చివేశారు సీఆర్డీయే అధికారులు. ఇవాళ ఉదయం 5.30 గంటల నుంచి ప్రొక్లెయినర్లు, బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేశారు.

వైసీపీ ఆఫీస్ కూల్చివేతపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు కక్ష్య సాధింపు రాజకీయాలకు దిగారని…సూపర్ సిక్స్ కంటే ఇదే మొదటి ప్రాధాన్యత ఇచ్చారని దుయ్యబట్టారు. వైసీపీ ఆఫీస్ కూల్చివేతపై స్పందించారు మాజీ సీఎం జగన్.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని…. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారని ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయని విమర్శించారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం అని స్పష్టం చేశారు.

- Advertisement -