ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ షూటింగ్ లో బిజీగా కనిపిస్తున్నాడు. చిన్న విరామం తర్వాత నిన్ననే ‘దేవర’ ఫ్రెష్ షెడ్యూల్ మొదలైంది. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలను కొరటాల శివ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో పాటుగా, ‘వార్ 2’ సినిమా కూడా అనౌన్స్ చేసాడు. ఈ చిత్రంతోనే ఎన్టీఆర్ మరోసారి ప్యాన్ ఇండియా లోకి ఎంటర్ అవుతున్నాడు. అయితే, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే సినిమా పై విపరీతమైన అంచనాలున్నాయి.
అయితే, ఈ చిత్రం వచ్చే ఏడాది అంటే 2024 ప్రధమార్ధంలోనే షూటింగ్ కి వెళుతుంది అనుకున్నారు. ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ నేపథ్యంలో ఉండబోతుంది. దానికి అనుగుణంగా ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ ఫినిష్ చేసి డిసెంబర్ కి రిలీజ్ చేయాలి. ఆ తర్వాత ఆయన ఎన్టీఆర్ మూవీ ప్రీ ప్రొడక్షన్, కథ, స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో పడాలి. దానికోసమే అడపా దడపా ఓ 6 నెలల సమయం కావాలి.
ఈలోపులో ఎన్టీఆర్ కూడా దేవర సినిమాని వచ్చే ఏడాది ఆగస్టులో ఫినిష్ చేసి, అనంతరం వార్ 2 సినిమాని పూర్తి చేసి, ప్యాన్ ఇండియా మార్కెట్ లో దించి రిలాక్స్ అవుతాడు. అందుకే ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ తమ ప్రాజెక్ట్ ని వచ్చే ఏడాది ఆగస్టు తర్వాతే మొదలుపెట్టాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ కూడా చేస్తాడని అంటున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.
Also Read:కాంగ్రెస్ తో ఢీ.. కామ్రేడ్ల దెబ్బ!